బర్త్ డేకి ఫారిన్.. అందుకే ఇప్పుడిలా!

వెంకటేష్, తేజ కాంబినేషన్ లో ఈరోజు కొత్త సినిమా ప్రారంభమైంది. ఓ 10మంది పెద్దల సమక్షంలో రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా ఓపెనింగ్ సైలెంట్ గా కానిచ్చేశారు. ఇంత సీక్రెసీ ఎందుకనే విషయాన్ని పక్కనపెడితే.. ఇంత సడెన్ గా సినిమాను ఎందుకు ప్రారంభించారనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చింది.

వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 13న ఈ సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఆరోజు వెంకీ సిటీలో ఉండడం లేదు. తన పుట్టినరోజును కుటంబసభ్యులతో కలిసి విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించాడు. అందుకే ఈరోజు సినిమాను లాంఛ్ చేశారు.

తన సినిమాకు తనే క్లాప్ కొట్టుకున్నాడు వెంకీ. రానా, పరుచూరి బ్రదర్స్ తో పాటు అనీల్ సుంకర, రాజా రవీంద్ర ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు. జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. హీరోయిన్ తో పాటు మిగతా టెక్నీషియన్స్ వివరాల్ని అప్పుడే వెల్లడిస్తారు.