బోల్డ్‌ అండ్‌ స్ర్టాంగ్ విద్యుల్లేఖ

బీ బోల్డ్‌.. బీ బ్యూటిఫుల్‌.. బీ స్ట్రాంగ్‌.. బీ డేరింగ్‌.. బీ ఒరిజినల్‌.. అంటూ సోషల్‌ మీడియాలో ‘హేటర్స్‌’పై మరోసారి విరుచుకుపడింది లేడీ కమెడియన్‌ విద్యుల్లేఖ రామన్‌. నిజానికి, సోషల్‌ మీడియాలో చాలాకాలంగా యాక్టివ్‌గా వుంటోన్న విద్యుల్లేఖ, తన బొద్దుతనంతోనే హాట్‌ హాట్‌గా కన్పిస్తూ సందడి చేస్తున్నా పెద్దగా ఆమెనెవరూ పట్టించుకోలేదు. ‘ఇంత భారీతనంతో, ఈ డ్రెస్సింగ్‌ అవసరమా.?’ అన్న కామెంట్స్‌ షరామామూలుగానే ఆమె అక్కౌంట్‌లో దర్శనమిస్తాయి.

అయితే, ఇటీవల ఓ ఫొటోసెషన్‌తో విద్యుల్లేఖ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఆమె బీభత్సంగా ట్రాలింగ్‌కి గురవడం, పలువురు సినీ ప్రముఖులు మద్దతివ్వడంతో.. ఈ వ్యవహారం అందరి దృష్టికీ వచ్చింది. ఇక, అక్కడినుంచి విద్యుల్లేఖ, బాడీ షేమింగ్‌పై తనదైన స్టయిల్లో స్పందిస్తూ, టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయిపోయింది.

‘హేటర్స్‌ ఎప్పుడూ వుంటారు.. వాళ్ళని నేనెప్పుడూ పట్టించుకోవాలనుకోలేదు. ఇప్పుడు మాత్రం, నాలాంటి వాళ్ళ తరఫున నేను స్ట్రాంగ్‌గా నిలబడాలనుకుంటున్నాను.. ప్లస్‌ సైజ్‌ మోడల్స్‌ హల్‌చల్‌ చేస్తున్న రోజులివి.. సరదాగా ఓ ఫొటోసెషన్‌కి ఫోజులిస్తే, దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారా.? ముందు ముందు ఇలాగే వుంటాను.. ఇంకా స్ట్రాంగ్‌గా, ఇంకా బోల్డ్‌గా కన్పిస్తాను..’ అంటోంది ఈ లేడీ కమెడియన్‌. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలతో బిజీగా వున్న విద్యుల్లేఖ.. సోషల్‌ మీడియా వివాదంతో రాత్రికి రాత్రి సాధారణ కమెడియన్‌ నుంచి ‘స్టార్‌’ అయిపోయిందనుకోవాలేమో.!