హాట్‌ రచ్చ: అప్పుడు బికినీ, ఇప్పుడు చీర.!

బికినీలోనేనా హాట్‌నెస్‌.? చీరకట్టులోనూ వుంటుంది హాట్‌నెస్‌.. ఈ మాట అందాల భామలు చాలా తెలివిగా చెప్పేస్తుంటారు. వాళ్ళకే తెలుసు మరి, అసలు సిసలు హాట్‌నెస్‌ అంటే ఏంటో.!

ఇక, అసలు ఇషయానికొస్తే బాలీవుడ్‌ నటి ఫాతిమా సనా షేక్‌, ‘దంగల్‌’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఛాన్సులొస్తున్నాయి. ఛాన్సులతోపాటే, వివాదాలు కూడా ఆమెను వెంటాడుతున్నాయి. కారణం, ఆమె సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా ఫొటోలు షేర్‌ చేస్తుండడమే. గతంలో ఓసారి బికినీ గ్లామర్‌ ఒలకబోసిన ఫొటోల నేపథ్యంలో ఫాతిమా సనా షేక్‌ మీద ఫత్వా కూడా జారీ అయ్యిందండోయ్‌.!

అయితే, అప్పట్లో ఫాతిమాకి బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి ఫుల్‌ సపోర్ట్‌ లభించిందనుకోండి.. అది వేరే విషయం. తాజాగా మరోమారు ఫాతిమా వివాదాల్లోకెక్కింది. ఈసారి ఆమె వివాదాల్లోకెక్కడానికి కారణం శారీతో ఆమె దిగిన ఫొటోనే. చీరకట్టులో హాట్‌ అప్పీల్‌, బికినీని మించి వుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అయినా, సినిమా అంటేనే గ్లామర్‌. గ్లామరస్‌ ప్రపంచంలో గ్లామరస్‌గా కన్పిస్తే తప్పేంటట.? ఇదీ, ఇంకోసారి బాలీవుడ్‌ సినీ జనం నుంచి ఫాతిమాకి వస్తోన్న మద్దతు.

ఫాతిమా అయితే తన మీద సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రాలింగ్‌ని మళ్ళీ లైట్‌ తీసుకుంది. ‘పనిలేనోళ్ళు చేసే విమర్శల్ని పట్టించుకోను.. ఫత్వాల్ని అసలే పట్టించుకోవాల్సిన అవసరం లేదు..’ అంటూ ఫాతిమా వ్యాఖ్యానించింది.