సావిత్రీ… గూగుల్ డూడుల్

మహిళా హక్కుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ స్వాతంత్ర్యం రాక ముందే బ్రిటీష్ పాలనలోనే ఓ మహామనిషి ఆలోచించంది. తన భర్తతో కలిసి స్త్రీల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసింది. ఆమే సావిత్రీబాయ్ పూలే.

సావిత్రీ పూలే 168వ జయంతి సందర్భంగా గూగుల్ ఆమెకు ప్రత్యేకంగా నివాళి అర్పించింది. సావిత్రీ పూలే మహిళల్ని కాపాడుతున్నట్లుగా ఫోటో పెట్టి డూడుల్ తయారుచేసింది. దీంతో సావిత్రీ పూలే గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తుచేసినట్లైంది.

సావిత్రీ పూలే మహారాష్ట్ర నయాగావ్ లో జన్మించారు. తొమ్మిదో ఏటే జ్యోతిరావ్ పూలేతో ఆమెకు బాల్యవివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, భర్త ప్రోత్సాహంతో చదువుకున్న సావిత్రీపూలే.. తొలి మహిళా ఉపాధ్యాయినిగా రికార్డు సృష్టించారు.

1848లోనే మహిళా పాఠశాల ప్రారంభించి అందరికీ కొత్త స్ఫూర్తి ఇచ్చారు. కులవ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్న సావిత్రి పూలే.. తనకూ అదే వ్యాధి సోకడంతో.. 1897లోనే ఆమె కన్నుమూశారు.