ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు

సాధారణంగా అబ్బాయిలంతా ఇలా ఫీలవుతుంటారు. కానీ హీరోలకు ఆ ప్రాబ్లమ్ లేదని అంతా అనుకుంటారు. కానీ సాయిధరమ్ తేజ్ కు మాత్రం ఆ ఇబ్బంది ఉందట. తనకు అస్సలు ఎవరూ పడట్లేదని చెబుతున్నాడు. జవాన్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ మెగా హీరో.. అమ్మాయిల్లేక జీవితం చాలా బోర్ కొట్టేస్తుందంటున్నాడు.

“నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ప్రస్తుతం నేను సింగిల్. ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు చాలా కష్టమైపోతోంది. మా కాలనీలో ఒక్క ఫిగర్ కూడా లేదు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అడిగినోళ్లు కాదంటున్నారు.” గర్ల్ ఫ్రెండ్స్ పై సాయిధరమ్ తేజ్ వెర్షన్ ఇది.

హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటూ, వాళ్లతో వీకెండ్ పార్టీస్ బాగా ఎంజాయ్ చేసే హీరోల్లో సాయిధరమ్ తేజ్ కూడా ఒకడు. ఒక దశలో ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ ప్రచారం కూడా జరిగింది ఇతడిపై. అలాంటి హీరో ఇప్పుడు తనకు గర్ల్ ఫ్రెండ్స్ లేరంటూ చెప్పడం కేవలం పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలి.