కొత్త హీరోయిన్ రాగానే సినీ పరిశ్రమలో తోక జాడించే దర్శకులు, హీరోలు చాలా మందే ఉన్నారని కథలు కథలుగా వింటూ ఉంటాం. కొత్త హీరోయిన్లలో చాలా మంది అవకాశాలు రావనే భయంతోనో, లేదా సినిమా మైకంలో పడడం వల్లనో డైరెక్టర్ లేదా హీరోలకి లోబడి నడుచుకుంటూ ఉంటారని గుసగుసలాడుకుంటూ ఉంటారు.
అయితే పూజ హెగ్డే మాత్రం మొదట్నుంచి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుందట. అందరితో స్నేహంగా మసలుకుంటూనే ఎవరికీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వదట. ఆమె తీరు తెలిసి అందరూ చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారని, ఎంత పెద్ద హీరో లేదా దర్శకుడు అని తెలిసినా కానీ పూజ అసలు లెక్క చేయదట.
తన టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తన అవసరం ఉందని తెలుసు కనుక తన రేంజ్ తానూ మెయిన్టైన్ చేస్తుంటుందట. కుర్రాళ్లలో తనకున్న క్రేజ్ వల్ల ఇప్పుడు ఏ పెద్ద సినిమాకి అయినా ముందుగా పూజ ఫ్రీగా ఉందా లేదా అని కనుక్కుని ఆమె కాదంటే వేరే వాళ్ళని అడుగుతున్నారు.