బన్నీ హీరోయిన్‌ ఇలా రెచ్చిపోతోందేంటి?

అల్లు అర్జున్‌కి మంచి ఫ్రెండ్‌ అయిన క్యాథరీన్‌ ‘ఖైదీ నంబర్‌ 150’లో రత్తాలు సాంగ్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుని కూడా కాలదన్నుకుంది. లారెన్స్‌తో గొడవ పడి చిరంజీవి సినిమా నుంచి వైదొలగిన క్యాథరీన్‌ కెరియర్‌ ప్రమాదంలో పడింది. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో తనతో కలిసి నటించిన క్యాథరీన్‌ని చిరంజీవి సినిమాకి అల్లు అర్జునే రికమండ్‌ చేసాడని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి.

అయితే అనూహ్యంగా ఆ అవకాశం చేజారిపోవడంతో ఆమెకి పొగరుబోతు అనే ముద్ర పడింది. దీంతో తన కెరియర్‌ని కాపాడుకోవాలని చూస్తోందో లేక మడి కట్టుకు కూర్చుంటే ఇక్కడ బండి నడవదని రియలైజ్‌ అయిందో కానీ ఒక్కసారిగా క్యాథరీన్‌ డోస్‌ పెంచేసింది. గత వారం విడుదలైన ‘గౌతమ్‌ నంద’లో బికినీలో కనిపించి అలరించిన క్యాథరీన్‌ త్వరలో రాబోతున్న ‘జయ జానకి నాయక’లో ఒక ఐటెమ్‌ సాంగ్‌ చేసింది.

ఈ సాంగ్‌లో ఆమె ఎంతగా రెచ్చిపోయిందంటే, సినిమాకి క్రేజ్‌ తీసుకురావడం కోసం సాంగ్‌ వీడియో క్లిప్‌ని ముందుగానే విడుదల చేసారు. రత్తాలు సాంగ్‌లో చూడలేకపోయిన క్యాథరీన్‌ సొగసుల్ని  అభిమానులు ఇందులో వీక్షించవచ్చు.