చంద్ర‌ బాబు అల‌ర్ట్ అయిపోయారు

చంద్రబాబు ప్రభుత్వ మూడు నెలలకోసారి ఇంటిలిజెన్సు డిపార్టుమెంటుతో రాష్ర్టంలో పరిస్థితులు, ప్రభుత్వం, పార్టీ పరిస్థితులపై సర్వే చేయిస్తోంది. అయిదే, ఆ సర్వేలో వస్తున్న ఫలితాలపై చంద్రబాబుకు విశ్వాసం కుదరకపోవడంతో ఓ ప్రయివేటు సంస్థ సహాయంతో ఆయన సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేలో వస్తున్న ఫలితాలు టీడీపీకి షాకులిస్తున్నాయట.  ప్రభుత్వంపై, పార్టీపై, ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి ఎక్కడికక్కడ బయటపడుతోందని ప్రముఖ తెలుగు పత్రిక ఒకటి వెల్లడించింది.

సర్వేలో కనిపిస్తున్న ప్రతికూల ఫలితాలతో పార్టీకి ముచ్చెమటలు పడుతున్నట్లు తెలిసింది. నిత్యం ఇంటిలిజెన్సు సర్వేల్లో వస్తున్న పూర్తి అనుకూల ఫలితాలకు దీనికి కంప్లీట్ గా తేడా కనిపిస్తుండడంతో పార్టీ పెద్దల కళ్లు తెరుచుకుంటున్నాయట. మరోవైపు ఈ తాజా  సర్వేలో ముందస్తు ఎన్నికలపై కూడా ఒక ప్రశ్న ఉన్నట్లు తెలిసింది. అందుకు కూడా పెద్దగా రెస్పాన్సు లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అందుబాటులో ఉన్నారా? ఎన్ని రోజులకు ఒకసారి పర్యటిస్తున్నారు? ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారా? స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారా? వంటి 12 ప్రశ్నలతో ఈ  సర్వే రూపొందించారు. చేస్తునత్నారు.

ఇలా దాదాపు 12 ప్రశ్నలతో ప్రశ్నావళి రూపొందించారు. ఈ సర్వేలు వెల్లడవుతున్న అభిప్రాయాలు చంద్రబాబుకు ఎప్పటికప్పుడు చేరుతుండడంతో ఆయన సహా నేతలంతా షాక్ తింటున్నారట. ప్రభుత్వాధికారులు, టీడీపీ నాయకులు అవినీతిలో మునిగితేలుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇళ్లు, పింఛన్, ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా కొనుగోలు చేయాల్సిందేనంటూ సర్వే బృందాలతో ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారని సమాచారం.

జన్మభూమి కమిటీ నాయకులపై కూడా ప్రజలు విరుచుకుపడుతున్నారని తెలిసింది. ఎప్ప‌టిక‌పుడు పార్టీని మెరుగు ప‌రుచుకోవ‌డానికి చంద్రబాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగ‌మే ఈ స‌ర్వేల‌ని చెబుతున్నారు. తానేమో డెడ్ లైన్లు పెట్టుకుని ప‌నిచేస్తుంటే… లీడ‌ర్ల స్వార్థం పార్టీకి ముప్పు తెస్తోంద‌ని బాబు భావిస్తున్నార‌ట‌. ఈ స‌ర్వేల‌తో క‌ల‌వ‌రం చెందుతున్న బాబు వీటికి అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే రాష్ట్రానికే కాదు, త‌న‌కూ అన్యాయం జ‌ర‌గ‌క‌మాన‌ద‌ని ఆంత‌రంగికుల‌తో వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.