ఇక్కడేమో రేణుదేశాయ్‌… అక్కడేమో ఆవిడ

భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినపుడు, కలిసి బతకలేమని అనిపించినప్పుడు విడిపోతారు. ఒకసారి చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వాళ్లు బ్రతికేస్తుంటారు. అయితే ఇదంతా పాత పద్ధతి. భార్యాభర్తలుగా విడిపోయినా, స్నేహితులుగా కలిసి ఉండవచ్చునని, స్నేహ సంబంధాలు కొనసాగించవచ్చునని చాటి చెబుతున్నాయి సినీ జంటలు.

పవన్‌కళ్యాణ్‌తో విడిపోయినా కానీ అతడంటే తనకున్న ఆరాధనాభావాన్ని చాటుకోవడానికి రేణు దేశాయ్‌ అస్సలు ఆలోచించదు. ఈ క్రమంలో తనని పవన్‌ అభిమానులు తిట్టి పోస్తున్నప్పటికీ రేణు మాత్రం ఒకప్పటి పవన్‌ ఫోటోలు పెట్టుకుని భర్త గ్లామర్‌ని చూస్తూ మురిసిపోతుంటుంది.  అచ్చంగా రేణు దేశాయ్‌నే తలపిస్తోంది హృతిక్‌ భార్య సుసానే కూడా. హృతిక్‌ని ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించి, తర్వాత పెళ్లి చేసుకుని మరెన్నో ఏళ్లు అతడితో కలిసి జీవించిన తర్వాత అతడికి విడాకులిచ్చింది సుసానే. భర్తతో చట్టబద్ధంగా విడిపోయినా కానీ తరచుగా హృతిక్‌ నామ జపం చేస్తోందామె.

హృతిక్‌కి హార్టీ బర్త్‌డే విషెస్‌ అందించడంతో పాటు అతని కొత్త సినిమా ప్రీమియర్‌కి వెళ్లి భర్తని పొగడ్తలతో ముంచెత్తింది. కాబిల్‌ చిత్రంపై సునానే స్పందన చూస్తే, అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనే డౌటొస్తుంది. ఇవి సెలబ్రిటీ జంటలకి మాత్రమే చెల్లుతాయా లేక ఇప్పుడు అన్ని జంటలదీ ఇదే ట్రెండా అనేది తెలియదు మరి. ఒకవేళ మిగతా వాళ్లకి ఇలాంటివి అలవాటు లేకపోయినా ఈ జంటలని చూసి స్ఫూర్తి పొంది విడిపోయాక కూడా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారేమో మరి.