సౌత్ ఇండియా టాప్ నటి నయనతార ఎప్పటినుండో తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ ఎప్పుడూ రిలేషన్ ను దాచాలని అనుకోలేదు. పబ్లిక్ లో కలిసే తిరిగారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ కలిసున్న ఫోటోను షేర్ చేస్తారు. అయితే రీసెంట్ గా విగ్నేష్ శివన్ పెట్టిన పోస్ట్ ను బట్టి వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందేమో అనిపిస్తుంది.
ఎందుకంటే ఆ ఫోటోలో ఇద్దరూ ముఖాలు కనపడకుండా జాగ్రత్త పడ్డారు కానీ కావాలని నయన్ చేతికి ఉన్న రింగ్ ను హైలైట్ చేసారు. దీనిని బట్టి వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని అందరూ భావిస్తున్నారు. ఆ పోస్ట్ కింద కామెంట్స్ కూడా అవే ఉన్నాయి. ఈ ఫొటోతో పాటు తమిళ్ లో పొయెటిక్ గా విగ్నేష్ క్యాప్షన్ ను కూడా జత చేయడం విశేషం. ఇక వీరిద్దరూ ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి.