అఫ్రిది ట్వీట్ కు నెటిజ‌న్ల ఫిదా!

భార‌త్‌, పాకిస్థాన్ ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొంద‌రు సెల‌బ్రిటీల సందేశాలు ఇరు దేశాల మ‌ధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఉన్నాయి. నిన్న స్వాతంత్య్రం జ‌రుపుకున్న పాకిస్థాన్ కు రిషీ క‌పూర్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ చేసిన ట్వీట్ పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటువంటి ట్వీట్లు ఇరు దేశాల మ‌ధ్య స్నేహ భావాన్ని పెంపొందిస్తాయ‌ని కొంద‌రు, శ‌త్రు దేశానికి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఏమిట‌ని మ‌రికొంద‌రు రిషీ ట్వీట్ పై కామెంట్ చేశారు. అదే త‌ర‌హాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది శుభాకాంక్ష‌లు తెలిపాడు. అఫ్రిది ట్వీట్ల‌పై భార‌త్ నెటిజ‌న్లు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ అత‌డిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అఫ్రిది ట్వీట్ చేశాడు. శాంతి, సహజీవనం, ప్రేమ కోసం ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని, మానవతా విలువల్ని కాపాడాలని, తన ఆశ వమ్ము కాదని ఆశిస్తున్నానని తన ట్వీట్ లో అఫ్రిది ఆ కాంక్షించాడు. అఫ్రిది ట్వీట్ పై ప‌లువు భార‌త నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దాయాది దేశ క్రికెట‌ర్ అయిన‌ప్ప‌టికీ భార‌త్ కు శుభాకాంక్ష‌లు చెప్పిన హీరో అఫ్రిది అంటూ ఒ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. అఫ్రిది చాలా చ‌క్క‌టి సందేశమిచ్చాడ‌ని, అంద‌రూ సంతోషంగా ఉండాల‌ని కోరుకునే క్రికెట‌ర్ అఫ్రిది అని ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు.  నిన్న జ‌రిగిన పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఏ భార‌త క్రికెట‌ర్ పాక్ కు విషెస్ చెప్ప‌క‌పోయినా, అఫ్రిది భార‌త్ కు విషెస్ చెప్ప‌డం గ్రేట్ అని కొంద‌రు కామెంట్ చేశారు.  గుడ్ బాయ్ చెప్పిన త‌ర్వాత  క్రికెట్ ఫౌండేషన్ ను నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు. ఈ ఫౌండేషన్ కు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సంతకంతో ఉన్న బ్యాట్ ను విరాళంగా ఇచ్చాడు.