గుడివాడపై గురిపెట్టిన సైకిల్

తెలుగు రాష్ట్రాల్లో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అది ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం. ఆయన బ్రతికున్నన్నాళ్లూ అక్కడ సైకిల్ కు ఎదురులేదు. కానీ కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లాక ఆ స్థానంలో సైకిల్ గాలి వీయడం లేదు.

గత ఎన్నికల్లో నానిని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించిన టీడీపీ విఫలమైంది. అయితే ఈసారి మాత్రం లెక్క తప్పకూడదని డిసైడైంది. కొడాలి నాని గర్వంతో విర్రవీగుతున్నారని, ఏకంగా సీఎం చంద్రబాబునే అనరాని మాటలంటున్నారని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు.

ఇప్పటికే జన్మభూమి కార్కక్రమాలు, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో నానిని దూరం పెడుతున్నారు. ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్ గా బుద్ధా వెంకన్నను నియమించడంతో అగ్గి రాజుకుంది. ఇప్పుడు గుడివాడ మున్సిపల్ చైర్మన్ టీడీపీలోకి రావడంతో.. గుడివాడకు పెద్దఎత్తున నిధులొస్తున్నాయి.

బుద్ధా వెంకన్నతో నానికి చెక్ పెట్టాలన్నది టీడీపీ గేమ్ ప్లాన్. ఎలాగైనా నాని గెలవకూడదని తమ్ముళ్ల పట్టుదల. గుడివాడ పట్టణంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రాలు చేపడుతున్న టీడీపీ.. కొడాలి నానిని ఓడించడానికి వ్యూహరచన చేస్తోంది.