టీ ష‌ర్ట్ విసిరిన షారుక్‌కు అరెస్ట్ త‌ప్ప‌దా?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు ఊహించ‌ని షాక్ ఎదురుకానుందా? అంటే.. అవున‌నే మాట వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆయ‌న చేసిన ప‌ని ఇప్పుడు అరెస్ట్ ముప్పునుఎదుర్కొనేలా చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. చిత్ర ప్ర‌చారంలో భాగంగా టీ ష‌ర్ట్ విసిరిన షారుక్ పెద్ద త‌ప్పు చేశార‌ని చెబుతున్నారు.

టీ ష‌ర్టు విసిరితే కూడా అరెస్ట్ చేస్తారా? అని డౌట్ రావొచ్చు. కానీ.. షారూక్ టీ ష‌ర్టు విస‌ర‌టం వ‌ల్ల ఎంత అన‌ర్థం జ‌రిగింద‌న్న విష‌యాన్ని వ‌డోద‌ర రైల్వే డీఎస్పీ త‌రుణ్ బ‌రోత్ చెప్పిన మాట‌లువింటే నిజ‌మే సుమా అనిపించ‌క మాన‌దు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యంలోకి వెళితే..

ఈ ఏడాది మొద‌ట్లో షారుక్ న‌టించిన ర‌యిస్ చిత్రం విడుద‌లైంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న వ‌డోద‌ర‌కు క్రాంతి ఎక్స్ ప్రెస్‌లో ప్ర‌యాణించారు. షారుక్ లాంటోడు రైల్లో వ‌స్తున్నాడంటే.. ఇక రైల్వే స్టేష‌న్లో ఎంత హ‌డావుడి ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. షారుక్ వ‌స్తున్నార‌న్న వార్త‌తో రైల్వే స్టేష‌న్ అంతా నిండిపోయింది. అదే స‌మ‌యంలో.. షారుక్ స‌ర‌దాగా జ‌నాల‌పైకి టీష‌ర్టులు.. బాల్స్ విసిరారు. షారుక్ చేతుల్లో నుంచి వ‌స్తున్న వ‌స్తువుల్ని అందుకోవాల‌న్న అతృత‌తో తొక్కిస‌లాట చోటు చేసుకుంది.

దీంతో.. ఒక వ్య‌క్తి దుర్మ‌ర‌ణం పాలు కాగా.. ఇద్ద‌రు పోలీసులు స్పృహ కోల్పోయారు. ఇదంతా కూడా షారుక్ టీ ష‌ర్టులు.. బాల్స్ విసిరేయ‌టం వ‌ల్లేన‌ని వ‌డోద‌ర రైల్వే డీఎస్పీ త‌రుణ్ బ‌రోత్ కోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో వెల్ల‌డించారు. ఒక వ్య‌క్తి మ‌ర‌ణానికి.. తొక్కిస‌లాట‌కు షారుకే కార‌ణ‌మ‌ని.. అత‌డ్ని అరెస్ట్ చేయాల‌ని కోర్టును కోరారు. మ‌రి.. పోలీసు అధికారి విన్న‌పానికి కోర్టు ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.