‘రారండోయ్‌…’ ఆ గండం గట్టెక్కుతుందా?

‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ రెండవ వారాంతంలోను డీసెంట్‌ కలక్షన్లు రాబట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోను బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌కి చేరుకుంది. ఓవరాల్‌ బిజినెస్‌ పరంగా హిట్‌ స్టేటస్‌ అందుకుంది.

మామూలుగా ఇక్కడి నుంచి మరో ఏడెనిమిది కోట్ల షేర్‌ అయినా రాబట్టుకోవాలి. అదే జరిగితే బయ్యర్లందరికీ మంచి లాభాలొచ్చి సూపర్‌హిట్‌ స్టేటస్‌ దక్కించుకుంటుంది. అయితే చైతన్య గత చిత్రం ‘ప్రేమమ్‌’ కూడా మొదటి పది రోజుల్లో ఇలాగే బ్రహ్మాండంగా ఆడింది. రెండవ సోమవారం నుంచి వసూళ్లు బాగా పడిపోవడంతో చివరకు పాతిక కోట్ల మార్కు దాటలేకపోయింది. రారండోయ్‌ విషయంలోను అది రిపీట్‌ అవుతుందేమోననే కంగారు బయ్యర్లలో నెలకొంది.

ఎందుకంటే ప్రస్తుతం బాక్సాఫీస్‌ డల్‌గా వుంది. ఈ రెండు వారాల్లో రారండోయ్‌ వేడుక చూద్దాం ఒకటే బయ్యర్లని ఆనందపెట్టే ఫలితాన్ని సాధించింది. సడన్‌ డ్రాప్‌ లేకుండా స్టడీగా రన్‌ అయినట్టయితే బయ్యర్లకి బాగా మిగులుతుంది. కానీ సడన్‌గా ప్రేమమ్‌లో డ్రాప్‌ అయితే మాత్రం కేవలం పెట్టుబడి వెనక్కి రాబట్టుకుని సంతృప్తి పడాల్సి వస్తుంది.