గాండీవాదారి అర్జున.. పిల్లతో ఏం చేస్తిన్నట్లు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవాదారి అర్జున అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కాప్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ అలాగే యాక్షన్ స్టిల్ పోస్టర్స్ ని ప్రేక్షకులకి అందించారు. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

వరుణ్ తేజ్ కెరియర్ లో మరో డిఫరెంట్ మూవీగా ఇది ఉండబోతుంది అనే మాట వినిపిస్తుంది. టైటిల్ పైన కూడా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇప్పటికే చాలా సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ఉగాది సందర్భంగా వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు గాండీవదారి అర్జున నుంచి ఒక పోస్టర్ ని వదిలారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్ స్టిల్స్ ఉండటం విశేషం. వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పిక్ ని షేర్ చేసుకున్నాడు.

దీంతో ఉగాది విషెస్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఏజెంట్ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్న అందాల భామ సాక్షి వైద్య ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఉండటం విశేషం. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండో సినిమాని కూడా ఈ అమ్మడు ఫినిష్ చేసేస్తూ ఉండటం విశేషం. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే వరుణ్ తేజ్ హిందీలో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. రియల్ లైఫ్ సంఘటనలని బేస్ చేసుకొని ఆ మూవీ తెరకెక్కుతుంది. శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండగా విశ్వ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఎయిర్ ఫైటర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతూ ఉండటం విశేషం.