జాన్వీ కపూర్ తెగింపు పై విమర్శలు

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ హాట్ ఫొటోలు మరియు ప్రేమ వ్యవహారాల కారణంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూనే ఉంది. జాతీయ మీడియాలో కూడా ఈ అమ్మడి యొక్క ప్రేమ వ్యవహారం గురించి చాలా సార్లు కథనాలు వచ్చాయి.

ప్రస్తుతం జాన్వీ కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. గతంలో పలు సార్లు వీరిద్దరు కలిసి పార్టీలకు పబ్ లకు వెళ్లిన ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంకా కెరీర్ లో సెటిల్ అవ్వకుండానే ఇలా ప్రేమ వ్యవహారాలు అవసరమా అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

ఆ మధ్య ఒక పార్టీలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు జంటగా కనిపించారు. ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం ఇప్పటికే తెలిసింది. అయినా కూడా ఇద్దరు ఈ వయసులోనే చెట్టా పట్టాలేసుకుని తిరగడం అవసరమా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. కెరీర్ పై దృష్టి పెట్టకుండా ఇలా ప్రేమ వ్యవహారాలతో టైమ్ పాస్ చేయడం సరైనదేనా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

ఇక జాన్వీ కపూర్ సినీ కెరీర్ విషయానికి వస్తే మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పై.. సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తి చూపించలేదు. కానీ బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కక పోవడంతో మొదటి తెలుగు సినిమాకు ఓకే చెప్పింది.

ఎన్టీఆర్ కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా తో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఎన్టీఆర్ 30 సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ను ఈ నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

అయితే మొదటి షెడ్యూల్ లో జాన్వీ కపూర్ హాజరు కానుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఎన్టీఆర్ 30 లోనే కాకుండా హిందీలో రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది.