టిల్లు స్క్వేర్ హీరో రేంజ్ మార్చబోతుందా..?

లక్ష్యం ఎంత పెద్దదైనా సరే తమ వంతు కృషి చేస్తూ కష్టపడితే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం కాదు. ఇది అందరు చెప్పే మాటే.. కానీ దాన్ని మాటల వరకే ఉంచేది కొందరైతే.. లక్ష్యం చేరుకునే లోగా తమ పరుగు ఆపే వారు కొందరు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న టార్గెట్ రీచ్ అయినవాడే జీవితంలో హీరోగా నిలుస్తాడు. వెండితెర మీద మనం చూసే హీరోల వెనుక కూడా ఇలాంటి కథలు చాలా ఉంటాయి. స్టార్ వారసుల పరిస్థితి ఏమో కానీ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చే వారు స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది.

ప్రస్తుతం యువ హీరోల్లో యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత విలన్ గా మారి కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో లీడ్ హీరోగా మారి తన కథలు తనే రాసుకుంటూ ఒక కొత్త క్యారెక్టరైజేషన్ తో సినిమాలు చేస్తున్నాడు.

డీజే టిల్లు సినిమాతో సిద్ధు టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. ఆ సినిమాను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని అలరించింది. డీజే టిల్లు క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిన ఆడియన్స్ ఆ సినిమా ఇంకాస్త ఉంటే బాగుండేది అనుకున్నారు. అలా కోరుకోవడం వల్లే టిల్లు స్క్వేర్ వస్తుంది. డీజే టిల్లుని మించి డబుల్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో అనుపమ గ్లామర్ మరో హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా బజ్ చూస్తుంటే కచ్చితంగా టిల్లు స్క్వేర్ సరికొత్త సెన్సేషన్ గా మారే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది.

టిల్లు స్క్వేర్ తో సిద్ధు రేంజ్ తప్పకుండా మారుతుందని చెప్పొచ్చు. సినిమాకు యూత్ లో ఉన్న బజ్ కి అంచనాలను అందుకుంటే మాత్రం సిద్ధు తన స్క్రీన్ నేం లానే స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ తో టిల్లు లవ్ కహానీ ఆగేలా లేదు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటే సినిమాకు ఇంకా కొన్ని భాగాలు తీసేలా ఉన్నాడు సిద్ధు జొన్నలగడ్డ. సో రానున్న కాలంలో మరిన్ని టిల్లు ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూడబోతున్నామన్నమాట.