త్రిష రెమ్యున‌రేష‌న్ దెబ్బ‌కి దిమ్మ తిరిగిపోతుందే!

‘పొన్నియ‌న్ సెల్వ‌న్’..’లియో’ విజ‌యాల‌ త‌ర్వాత అందాల న‌టి త్రిష మ‌ళ్లీ కెరీర్ స్పీడ‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా కొత్త సినిమాల‌కు క‌మిట్ అవుతూ అంత‌కంత‌కు జోష్ ప్ర‌ద‌ర్శిస్తుంది. 40 ఏళ్ల వ‌య‌సు లోనే నాకెవ్వ‌రు సాటి అంటూ అవకాశాలు అందుకుంటుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి ఖాతాలో ఉన్న చిత్రా ల‌న్ని స్టార్ హీరోల‌తో న‌టిస్తున్నావే. మ‌రి ఈ చిత్రాలే త్రిష‌ని మ‌ళ్లీ అగ్ర స్థానంలో కూర్చోబెడు తున్నాయా? లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కే పోటీగా నిలుస్తుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం త‌ల అజిత్ స‌ర‌స‌న ‘విదా మియార్చీ’ అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇప్ప‌టికే అజిత్ కి జోడీగా కొన్ని సినిమాలు చేసింది. ఆ పెయిర్ అంటే ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. అందుకే మ‌రోసారి అజిత్ జోడీగా కుదిరింది. అలాగే మ‌ల‌యాళం స్టార్ మోహ‌న్ లాల్ స‌ర‌స‌న’ రామ్’ అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇదిగాక ‘ఐడెంటీఫై’ అనే మ‌రో మ‌లయాళం సినిమాకి సైన్ చేసింది. ఈ మ‌ధ్యనే క‌మ‌ల్ హాస‌న్-మ‌ణిర‌త్నం ‘థ‌గ్ లైప్’ లోనూ హీరోయిన్ గా ఎంపికైంది.

ఇక 14 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభ‌ర‌’లో జోడీ క‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా వ‌రుస‌గా అగ్ర హీరోల‌తో త్రిష సినిమాలు చేయ‌డం అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 40 ఏళ్లు మీద ప‌డినా అమ్మ‌డు అదే గ్రేస్ తో అవ‌కాశాలు అందుకుంటుంటుంద‌న్న టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇదంతా ఓ ఎత్తైతే థ‌గ్గ్ లైఫ్ కోసం అమ్మ‌డు భారీగానే పారితోషికం తీసుకుంటుంని స‌మాచారం. ఏకంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఏ హీరోయిన్ ఛార్జ్ చేయ‌నంత చేస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.

అక్ష‌రాలా 12 కోట్ల రూపాయాలు ఈ ఒక్క సినిమాకే తీసుకుంటుందిట‌. ఇంత పారితోషికం ఇంత‌వ‌ర‌కూ ద‌క్షిణాదిన ఏ హీరోయిన్ తీసుకోలేద‌ని..ఆ ర‌కంగా ఇదో రికార్డు అంటూ ప్ర‌చారం సాగుతోంది. మ‌ణిర‌త్నం సినిమాలో ఛాన్స్ అంటే? హీరోయిన్ ఎంతిచ్చినా న‌టిస్తుంది? ఆ లెక్క‌న చూసుకుంటే త్రిష మిగాతా సినిమాల‌కు అంత‌కు మించి ఛార్జ్ చేస్తుందా? అన్న సందేహం రాక మాన‌దు. మాలీవుడ్ లో అంత డిమాండ్ చేయ‌డానికి ఛాన్స్ లేదు గానీ.. టాలీవుడ్ లో మాత్రం అంత‌కు మించి ఛాన్స్ ఉంది. మ‌రి ‘విశ్వంభ‌ర‌’కి ఎంత తీసుకుంటుందో.