దేవరకొండ కోసం KGF టెక్నీషియన్

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే లైగర్ సినిమాతో భారీ ప్లాప్ ను అందుకున్న ఈయన.. ఆ తర్వాత నుంచి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా చేస్తుండగా.. మరో సినిమాకు ఓకే చెప్పారుు.

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఈ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే… విజయ్ గౌతమ్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి కేజీఎప్ కేజీఎఫ్ 2 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన శివ కుమార్ ను తీసుకోబోతున్నారట. సినిమాలో యాక్షన్ ప్లస్ కొంచెం డార్క్ థీమ్ ఉండడంతోనే ఈయనను తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండకు 12వ చిత్రం కావడంతో దీని వీడీ12 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో విజయ్ గతంలో ఎప్పుడూ కనిపించని క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసి కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇందులో ఓ వ్యక్తి పోలీస్ డ్రెస్సులో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిలా కనిపిస్తున్నాడు. సముద్రతీరంలో మంటల్లో కాలిపోతున్న పడవలతో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల నటించబోతోంది. గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవకొండ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి చూడాలి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకోబోతోందో.