నీకు మరేం దొరకలేదా.. అంబానీ ఇంటి వేడుకలో పాల్గొన్న హీరోపై ట్రోల్స్

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ల యొక్క వివాహ నిశ్చితార్థ వేడుక ముంబైలో వైభవంగా జరిగింది. నిన్న జరిగిన ఈ వేడుక కు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పలువురు ఈ వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఒక్క బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం మినహా మిగిలిన గెస్ట్ లు అంతా కూడా సాంప్రదాయ కట్టు బొట్టుతో హాజరు అయ్యారు. ఒక్క జాన్ అబ్రహం మాత్రం జీన్స్ పాయింట్ మరియు టీ షర్ట్ తో అంత పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశంలోనే అత్యంత ధనికుడు అయిన అంబానీ వారి ఇంట్లో వేడుక అంటే ఏ స్థాయిలో వెళ్లాలి.

అలాంటి వేడుకలో జాన్ అబ్రహం ఏదో చిన్న సినిమా ప్రెస్ మీట్కు వెళ్లినట్లుగా టీ షర్ట్ మరియు జీన్స్ వేసుకుని వెళ్లడం చాలా విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నీకు ఈ టీ షర్ట్ మరియు పాయింట్ తప్ప మరేం దొరకలేదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

జాన్ అబ్రహం యొక్క డ్రెస్సింగ్ ఇష్యూ ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ డ్రెస్ విమర్శలపై జాన్ అబ్రహం ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.