పవన్.. మెగా వేడుకలో అల్లు ఫ్యామిలీ ఎందుకు లేదు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సుదీర్ఘ ప్రస్తానం తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అందరిని గెలుపించుకున్నారు. నేషనల్ మీడియా సైతం ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని అభివర్ణిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అంటూ ప్రశంసించారు. కూటమికి ఏపీలో భారీ ఆధిక్యం రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఒప్పుకున్నారు.

అటు వైసీపీ నాయకులు కూడా తమ ఘోర ఓటమికి పవన్ కళ్యాణ్ కారణమని బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ ఇంట్లో పవన్ కళ్యాణ్ విజయోత్సవ వేడుకలని ఫ్యామిలీ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు మెగా హీరోలు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మెగా బ్రదర్స్ వారి వారసులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పాదాలని తాకి నమస్కరించడం, అందరూ కలిసి ఆప్యాయంగా వేడుక జరుపుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా, పవర్ స్టార్ అభిమానులు అందరూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ భావోద్వేగాల్ని పంచుకున్నారు. ఇలాంటి దృశ్యం ఎప్పుడో కానీ చూడలేం అంటూ గొప్పగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ వేడుకలో అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ పార్టిసిపేట్ చేయలేదు.

మెగాస్టార్ ను అమితంగా ఇష్టపడే బావగారు అల్లు అరవింద్ కూడా హాజరు కాలేదు. అల్లు శిరీష్ సైతం కనిపించలేదు. దీంతో రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో చాలాసార్లు విరిమధ్య గ్యాప్ ఉందని కొన్ని పరిణామాలు కనిపించాయి. అయినప్పటికీ ఆ తరువాత వాటిని కండిస్తూ వారి హీరోలు ఖండించారు. ఇప్పుడు మరొకటి హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పా రవికిశోర్ చంద్ర రెడ్డి కోసం నంద్యాల వెళ్లి ఎన్నికలలో గెలిపించాలని కోరాడు. దీనిని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అయితే వైసీపీ లీడర్ ని కలవడం జనసైనికులకి నచ్చలేదు.

అదలా ఉంచితే తరువాత అల్లు అర్జున్ ఈ టాపిక్ పై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి అతనికి ఎప్పుడు నా మద్దతు ఉంటుందని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా కూడా అల్లు అర్జున్ ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెప్పారు. అయితే కీలకమైన మెగా వేడుకలో మాత్రం అల్లు అర్జున్, అరవింద్, శిరీష్ లలో ఎవరూ పార్టిసిపేట్ చేయలేదు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వేడుకలో అసలు వారి ఎందుకు పాల్గొనలేదు అనే విషయంపై అల్లు హీరోలు ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.