పాన్ ఇండియా క్రేజ్ లో ’18 పేజిస్’ దమ్మెంతో చూడాలి!

యంగ్ హీరో నిఖిల్ అనూహ్యంగా పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘కార్తికేయ-2′ పాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకున్నచిత్రంగా నిలిచింది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇది ఓ సంచలనమే. హిందీ బెల్ట్ లో ఊహించని వసూళ్లని సాధించింది.

తెలుగు రాష్ట్రాలల్లో సైతం నికిల్ కెరీర్ లోనే అతి పెదద్ హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఆ సినిమా యూనిట్కి అన్నిచోట్లా మంచి పేరొచ్చింది. తాజాగా ఇదే క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోబుతున్నాడు నిఖిల్. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’18 పేజిస్’ రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోనూ అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆ రకంగా కార్తికేయ-2 కాంబో మళ్లీ తెరపైకి వస్తోంది. అయితే ఇప్పుడీ క్రేజ్ని నిఖిల్ 18 పేజిస్ విషయంలో ఎంత వరకూ వర్కౌట్ చేస్తాడు? అన్నది చూడాలి. కార్తికేయ2 ముందు వరకూ అతను యావరేజ్ హీరో. ఆ సినిమా వసూళ్లు అతని స్థాయిని మార్చేసాయి. స్టార్ ఇమేజ్ ని రెట్టింపు చేసాయి. ఇప్పుడా ఇమేజ్ తో తన కొత్త సినిమా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించగలగాలి.

భారీ ఓపెన్సింగ్ తేగలగాలి. అప్పుడే నిఖిల్ సత్తా ఏంటన్నది తేలేది. స్టార్ హీరోల సినిమాలు ఓపెనింగ్స్ ఏ స్థాయిలో వస్తాయో…నిఖిల్ విషయంలోనూ అది జరిగాలి. కంటెంట్ కంటే ముందు హీరో ఇమేజ్ అనేది కీలకం. ఆ ఇమేజ్ తోనే జనాలు థియేటర్ రావాలి. మరి నిఖిల్ సత్తా ఎలా ఉంటుందన్నది అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి అంచనా వేయోచ్చు.

మరి ఓపెనింగ్ రేసులో నిలుస్తాడా? లేక మరోసారి హిట్ కంటెట్ తో నెమ్మదిగా బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా? అన్నది చూడాలి. ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉండగా బన్నీ వాస్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

కార్తికేయ-2 హిదీ వసూళ్లు చూసి అరవింద్ షాక్ అయిన సంగతి తెలిసిందే. 50 థియేటర్లలో రిలీజ్ చేసిన సినిమా ఆ తర్వాత 1000 థియేటర్లలో రిలీజ్ అయిందంటూ సంతోషం వ్యక్తం చేసారు. మరి సైలెంట్ గా ’18 పేజిస్’ ని కూడా పాన్ ఇండియాలో వదులుతున్నారో? ఏమో చూడాలి.