పిల్లలతో చిల్ అవుతున్న సింగర్ సునీత..!

సింగర్ సునీత.. ఈ పేరు వినగానే మనకు ఆమె తీయటి గొంతుతో పాటు ఆమె అందమైన మెహం మదిలో నిలుస్తుంది. 44 ఏళ్ల వయసులోనూ చాలా అందంగా కనిపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సంపాదించింది సునీత. 15 ఏళ్ల వయసులోనే గాయనిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె… గులాబీ ఎగిరే పావురమా చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత గాత్రదానం చేస్తూ.. దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.

కెరియర్ పరంగా పాటలు డబ్బింగ్ తో దూసుకెళ్తున్న సునీత.. పర్సనల్ లైఫ్ లో చాలా కష్టాలు అనుభవించింది. సింగిల్ పేరెంట్ గా ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించే ఆమె పిల్లలు ( ఆకాశ్ శ్రేయలు).. రెండేళ్ల క్రితం సునీతకు దగ్గరుండి పెళ్లి చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనినితో నిశ్చితార్థం చేసుకొని సునీత అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పిల్లలు పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకొని ప్రస్తుతం చాలా సంతోషంగా గడుపుతోంది.

అయితే తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సునీత.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన పెళ్లి విషయంతో పాటు వెకేషన్స్ కెరియర్ పిల్లలు.. ఇలా ప్రతీ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. కానీ కొందరు.. రామ్ తో పెళ్లయ్యాక ఆమెని విపరీతంగా ట్రోల్ చేశారు. వాటిపై కూడా పద్ధతిగా స్పందిస్తూనే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది సునీత. తాజాగా తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను సునీత ఇస్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ముందు తాను కళ్లు మూసుకొని నవ్వుతూ నిల్చొని ఉండగా.. వెనకాల ఆకాశ్.. తన చెల్లి తల పట్టుకొని ఉన్నాడు. ఈ ఫొటోని చూస్తేనే వారు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో తెలిసిపోతుంది. సునీతకు తన ఇద్దరు పిల్లలే బలం బలహీనత అని చాలా సార్లు చెప్పింది. వారు లేకుండా తన జీవితాన్ని అస్సలు ఊహించుకోలేనని వివరించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే పది కాలాల పాటు సంతోషంగా ఉండమంటూ మరికొంత మంది చెబుతున్నారు.