ప్రభాస్.. కన్నప్పకి అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

మంచు విష్ణు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మూవీ భక్త కన్నప్ప. శ్రీకాళహస్తి నేపథ్యంలో జరిగిన ఒక హిస్టారికల్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హిందీలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథలతో ఎన్నో సీరియల్స్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ భక్త కన్నప్ప సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఏకంగా 90 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు సమర్పణలో విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై భక్త కన్నప్పని ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మహా శివుడి పాత్రలో కనిపించడానికి ఒకే చెప్పేశాడంట. ఈ న్యూస్ వైరల్ కావడంతో భక్త కన్నప్ప సినిమాపైనే కూడా ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ లో శ్రీరాముడి పాత్రలో కనిపించారు.

కల్కి సినిమాలో శ్రీ మహావిష్ణువు అవతారం అయినా కల్కిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు భక్త కన్నప్ప సినిమాలో మహా శివుడిగా కనిపించడానికి ఒకే చెప్పాడు. ఈ జెనరేషన్ లో దేవుడి పాత్రలని బ్యాక్ టూ బ్యాక్ చేస్తోన్న హీరోగా ఇప్పుడు ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశారని చెప్పాలి. అయితే ఈ మూవీలో ప్రభాస్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందని చూసుకుంటే ముందు మోహన్ బాబు అని చెప్పాలి.

మోహన్ బాబుతో బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. మోహన్ బాబు అంటే ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. అలాగే విష్ణుతో ప్రభాస్ కి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. దాంతో పాటు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కి పౌరాణికం, హిస్టారికల్ కథలని డీల్ చేయడంలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. మహాభారతం సీరియల్ అంత సూపర్ కావడానికి ముఖేష్ కుమార్ సింగ్ ఒక కారణం.

అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ భక్త కన్నప్ప చేస్తున్నారంటే కచ్చితంగా శివుడి పాత్రని గొప్ప గా డిజైన్ చేస్తారనే నమ్మకంతోనే ప్రభాస్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ నటించనుండటం వలన ఈ మూవీకి పాన్ ఇండియా అప్పీల్ రావడంతో పాటు మంచి ఓపెనింగ్స్ రాబట్టడానికి ఛాన్స్ దొరికింది.