మరోసారి ట్రిప్ కి ప్రభాస్.. ఆ సినిమా పరిస్థితి ఏంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో, ఆయన తదుపరి సినిమా సలార్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా, మరో వైపు ఆయన చేతిలో కల్కి, తో పాటు మారుతి డైరెక్టన్ లో మరో సినిమా కూడా ఉన్నాయి. ఇటీవలే, మారుతి డైరెక్షన్ లో మూవీ షూటింగ్ శరవేగంగా మొదలైంది. అయితే, అంతలోనే, మళ్లీ బ్రేకులు పడ్డాయి.

రీసెంట్ గానే ప్రభాస్ అమెరికా ట్రిప్ నుంచి ఇండియాకు వచ్చారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఆయన విదేశాలకు వెళ్లడం విశేషం. దాదాపు పదిహేను రోజుల పాటు ఆయన విదేశాలకు ట్రిప్ కి వెళ్లారట. అయితే, ట్రిప్ కి వెళ్లేముందు ఆయన కొన్ని యాక్షన్ సీన్లు పూర్తి చేసేశారట. ప్రభాస్ లేకపోయినా, మూవీ షూటింగ్ ఆగకూడదని మూవీ టీమ్ భావిస్తోందట.

అందుకే, ప్రభాస్ లేకుండా ఉండే సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి మొదటి నుంచి డీలక్స్ రాజా అనే పేరు పెట్టాలని మూవీ అనుకుంది. వర్కింగ్ టైటిల్ గా దీనినే పెట్టి, షూటింగ్ మొదలు పెట్టారు. అయితే, ఇప్పుడు ఈ మూవీకి పేరు మార్చినట్లు సమాచారం. వింటేజ్ కింగ్ అనే పేరు పెట్టాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం విశేషం. ఇక, ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ని ఇప్పటి సినిమాల్లో కంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో లుక్ చూడటానికి ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఆ కోరిక ఈ సినిమాతో తీరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ మూవీలో సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి నటులు కీలక పాత్ర పోషిస్తుననట్లు సమాచారం. ఇక ఇద్దరు హీరోయిన్లు ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. మళయాళ బ్యూటీ మాళవిక మోహన్ తో పాటు రిద్దికుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు నిధి అగర్వాల్ కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

డైరెక్టర్ మారుతి సినిమాలు అంటే ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఫుల్ కామెడీ తో సాగుతుంది. ఇప్పుడు, ఈ మూవీ కూడా కామెడీ జోనర్ లో నే సాగుతుందని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.