మరో కొత్త వ్యాపారంలోకి విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. తనదైన మ్యానరిజంతో యూత్‌లో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.

తాజాగా స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఓ వాలీబాల్ జట్టుకు సహ యజమానిగా మారాడు ఈ రౌడీ హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన ఆయన… మరోవైపు ఆయా రంగాలలోకీ ఎంట్రీ ఇస్తున్నారు.

గతంలో ‘రౌడీ వేర్’ని ప్రారంభించాడు. ఇక తాజాగా క్రీడారంగంలోనూ అడుగుపెట్టాడు ఈ సెన్సేషనల్ హీరో… స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. విజయ్ హైదరాబాద్‌లోని ప్రొఫెషనల్ వాలీబాల్ మెన్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహ యజమానిగా మారిన ఈ హీరో… విజయ్ తన స్కూల్ డేస్ నుంచే వాలీబాల్‌ని ఇష్టపడేవాడని తెలుస్తోంది.

ఈ క్రమంలో గచ్చిబౌలి స్టేడియంలో విజయ్ తన టీమ్ తో కలిసి జెర్సీని ఆవిష్కరించాడు. ఇకపై వాలీబాల్ ఆటను దేశం గర్వించేలా నా వంతుగా ప్రోత్సహిస్తా అంటున్నాడు ఈ హీరో. భారత్ లోనే కాకుండా ఇతర ప్రాంతాలకూ టీమ్ ను తీసుకెళ్లేందుకు చేయాల్సింది చేస్తాననీ అన్నాడు.

ప్రస్తుతం ఈ రౌడీ హీరో ‘ఖుషి’ షూటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా సమంత కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితోనూ VD12లో నటించనున్నారు.