విడ్డూరం… పాత సినిమాకు కొత్త రిలీజ్

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్‌ హీరోల పాత సినిమాల రీ రిలీజ్ చూశాం. అయితే ఈసారి మాత్రం ఒక పాత సినిమా రీ రిలీజ్ గా కాకుండా డైరెక్ట్‌ రిలీజ్ అన్నట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా తెలుగు సినిమా కాదు.. తమిళంలో రూపొందిన సినిమా తెలుగు లో డబ్‌ అయ్యి విడుదల అవ్వబోతుంది.

హిందీ వర్షన్ మేడం గీత రాణి ని యూట్యూబ్‌ తో పాటు ప్రముఖ ఛానల్ లో ఉత్తరాది ప్రేక్షకులు చూశారు. ఇక తెలుగు లో కూడా జీ తెలుగు లో కొన్ని సార్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలాంటి సినిమాను ఇప్పుడు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాచ్చసి సినిమాను తెలుగులో త్వరలో ‘అమ్మ ఒడి’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఒక ప్రభుత్వ పథకం పేరుతో సినిమా ను అది కూడా పాత సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

జ్యోతిక నటించిన చాలా సినిమాలు రిలీజ్ చేయవచ్చు.. లేదంటే ఇతర హీరోల తమిళ సినిమాలు రిలీజ్ చేయవచ్చు. అయిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమానే ఎందుకు ఇప్పుడు రిలీజ్‌ చేయాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదు అంటూ కొందరు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. త్వరలో జ్యోతిక ‘అమ్మ ఒడి’ సినిమా రిలీజ్ డేట్‌ ను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.