సూపర్ స్టార్ కు ఈగో అడ్డు వచ్చిందా?

దేశం గర్వించే విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అత్యుత్తమ అవార్డ్ ఆస్కార్ లభించిన విషయం తెల్సిందే. నాటు నాటు పాటకు కీరవాణి మరియు చంద్రబోస్ లు ఆస్కార్ అవార్డును దక్కించుకున్న నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది స్టార్ హీరోలు మరియు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ గర్వంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.

హిందీ సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు కూడా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మొత్తానికి నాటు నాటు విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో కొందరు మాత్రం తమ ఈగో తో కనీసం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ను నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల ఆయన స్పందించక పోవడం పట్ల సినీ ప్రేమికులు తప్పుబడుతున్నారు. హిందీ సినిమా పఠాన్ ను ప్రమోట్ చేసేందుకు ట్వీట్ చేసిన విజయ్ ఒక సౌత్ సినిమాకు ఆస్కార్ వస్తే కనీసం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని కొందరు అంటున్నారు.

ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేయలేనంత బిజీగా విజయ్ ఉన్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులను అభినందించేందుకు ఈగో అడ్డు వస్తుందా అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి విజయ్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.