నాటు మందు కాదది.. ఆనందయ్య ‘చట్నీ’.!

బాబు గోగినేని.. బిగ్ బాస్ రియాల్టీ షోలో చేసిన కుట్రల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనో అపర మేధావి. కరోనా వైరస్ ముప్పు తగ్గించడానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఓ నాటు వైద్యుడు ఆనందయ్య తనవంతుగా ప్రయత్నం చేశాడు. సరే, ఆ ప్రయత్నం సఫలమవుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. కంట్లో చుక్కలు పోయగానే, ఒంట్లో ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెరిగాయ్.? అన్న అనుమానం వుండనే వుంది.

ఆనందయ్య నాటు మందు వల్ల దుష్ప్రభావాల్లేవని ప్రాథమిక పరీక్షల అనంతరం ప్రభుత్వాధికారులే అధికారికంగా వెల్లడించారు. ఇక, దీన్ని ‘ఆనందయ్య చట్నీ’ అంటూ బాబు గోగినేని అభివర్ణించడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

గత కొద్ది రోజులుగా ఆనందయ్య మందు విషయమై బాబు గోగినేని చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. నిజానికి, బాబు గోగినేని లాంటి మేధావులు రెమిడిసివిర్ ఇంజెక్షన్ల విషయంలో గొంతు చించుకోవాలి. కానీ, అప్పుడు వాళ్ళకి నోరు పెగలదు. కారణం ఒకటే.. వీళ్ళలాంటివాళ్ళంతా కార్పొరేట్ పెద్దల మోచేతి నీళ్ళు తాగుతారు గనుక.. అన్నది మెజార్టీ అభిప్రాయం.

‘మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.?’ అంటూ ప్రకటనలు వచ్చినా, వాటిన మేధావి బాబు గోగినేని ఏనాడూ పట్టించుకోలేదు. కొందరి మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడంలో బాబు గోగినేని దిట్ట. ఈ క్రమంలో ఆయనకు తెరవెనుకాల ఎంత పెద్ద మొత్తంలో సొమ్ముల్ని కొందరు పెద్దలు ముట్టచెబుతుంటారు.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

మేధావి ముసుగేసుకుంటే ఏదైనా మాట్లాడేయొచ్చనుకుంటాడు బాబు గోగినేని. చూశాం కదా.. బిగ్ బాస్ రియాల్టీ షోలో బాబు గోగినేని చిల్లర వేషాలు. అదొక గేమ్ షో అని తెలుసు.. అది జస్ట్ ఓ ఆట అని కూడా తెలుసు. కానీ, అక్కడ కుట్రలు పన్నిన బాబు గోగినేని చివరకు సాధించిందేంటి.? తన స్థాయిని దిగజార్చేసుకున్నాడంటే. అలాంటి వ్యక్తిని ఇంకా మేధావి.. అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అందుకే, తనను తాను మేధావిగా చెప్పేసుకుంటాడాయన. ఆయన ఆనందాన్ని మనమెందుకు కాదనాలి.?

హ్యూమనిస్టు.. ఇంకేదో ఇస్టు.. ఇలా చాలా పేర్లు పెట్టుకున్నది ఓ నాటు మందుని ఉద్దేశించి ‘చట్నీ’ అని అభివర్ణించడానికా.? మరి, ఈ మేదావిని.. మేతావి.. అని ఎవరైనా అంటేనో.?