33వేల అడుగు ఎత్తు లో భారీ యాక్ష‌న్ !

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ముర‌గదాస్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ లో `సికంద‌ర్` ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాయ్ కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ త్ర‌యంపై అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ముర‌గ‌దాస్ మార్క్ చిత్రంగా హైలైట్ చేస్తున్నారు. నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ ముర‌గ‌దాస్ కెప్టెన్ కుర్చి ఎక్కి చేస్తోన్న చిత్రం కావ‌డంతో కథ‌లో లోతైన విశ్లేష‌ణ ఉంటుంద‌ని అంతా గెస్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఆ విష‌యాన్ని చిత్ర నిర్మాత సాజిద్ న‌డియావాలా రివీల్ చేస్తూ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని పంచుకున్నారు. ` ఈనెల 18 `సికంద‌ర్` యాక్ష‌న్ ప్రారంభం కానుంది. మొద‌టి రోజున అతిపెద్ద ఎయిర్ యాక్ష‌న్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాం` అని హింట ఇచ్చారు. అయితే ఆ స‌న్నివేశం ఎలా ఉంటుంది? అన్న‌ది రివీల్ చేయ‌లేదు.

ఈ నేప‌థ్యంలో చిత్ర వ‌ర్గాల నుంచి ఇది సాధార‌ణ యాక్ష‌న్ సీక్వెన్స్ కాద‌ని తెలుస్తోంది. స‌ముద్ర మ‌ట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో చిత్రీక‌రించ‌బోయే ఓ వైమానిక యాక్ష‌న్ ఎపిసోడ్ అట ఇది. ఇంత‌వర‌కూ ఇంత ఎత్తులో యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌లేదు. ఎయిర్ స్పేస్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలొచ్చాయి. కానీ ఎవ‌రూ ఇంత‌టి సాహ‌సాన్ని చేయ‌లేదు. తొలిసారి ముర‌గ‌దాస్ ఈ ర‌క‌మైన‌ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ కి తెర తీసారని తెలుస్తోంది.

ముర‌గ‌దాస్ సినిమాల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల్లో సైతం బోలెడంత క్రియేటివిటీ ఉంటుంది. అవి అంతే క‌న్విన్సింగ్ గానూ అనిపిస్తాయి. అలాంటి స‌న్నివేశాల‌తో సీట్ ఎడ్జ్ న ప్రేక్ష‌కుల్ని కూర్చోబెట్ట‌డం అన్న‌ది ముర‌గ‌దాస్ కే చెల్లింది. ఇప్పుడు ఏకంగా భారీ యాక్ష‌న్ సీన్స్ చేస్తున్న నేప‌థ్యంలో సినిమాకే ఇది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ యాక్ష‌న్ సీన్ లో నేష‌న‌ల్ క్ర‌ష్ కి ఛాన్స్ ఉందా? అన్న‌ది తెలియాలి.