నీడనిచ్చే చెట్టును నరుక్కోం.. మళ్లీ వైసీపీని గెలిపించుకుంటాం: మంత్రి కాకాణి

ఇటివల సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం సీఎం జగన్ వద్దకు చేరింది. ఈనేపథ్యంలో మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఇద్దరితో వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం మంత్రి కాకాణి మాట్లాడుతూ..

‘గతంలో ఎలా పనిచేసినట్టే ఇప్పుడూ పని చేసుకోమని సీఎం చెప్పారు. అనిల్ కు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కొందరు కావాలనే మామధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సభ పెట్టుకుంటే తప్పేం లేదు. పోటాపోటీ సభలనేది అవాస్తవం. నీడనిచ్చే చెట్టును నరుక్కునే వాళ్లం కాదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే మా లక్ష్యం’ అని అన్నారు.

మాజీ మంత్రి అనిల్ మాట్లాడుతూ.. ‘మంత్రి కాకాణికి నాకూ మధ్య విబేధాలేమీ లేవు. ఫ్లెక్సీల వివాదం ఏమీ లేదు. ఆనం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. సాయం చేసిన వారికి మరింత సాయం చేస్తా’ అని అన్నారు.