బాలయ్య సింగింగ్ ఫుల్ ఫన్.. ఆహా అన్ స్టాపబుల్

నందమూరి బాలకృష్ణ ఈమద్య కాలంలో ఎంటర్ టైన్మెంట్ తో కుమ్మేస్తున్నాడు. అప్పట్లో సినిమాలతో మాత్రమే వెండి తెరపై అలరించి మాస్ ఆడియన్స్ కు మాత్రమే చేరువ అయిన బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ పై మరియు బుల్లి తెరపై ప్రతి చోటా కూడా కుమ్మేస్తున్నాడు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా బాలయ్య తెగ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఆహా అన్ స్టాపబుల్ షో తో ఓటీటీ పై సందడి చేసిన బాలయ్య మరోసారి తెలుగు ఇండియన్ ఐడల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది.టాప్ 6 కంటెస్టెంట్స్ ఉండగా బాలయ్య తాజా ఎపిసోడ్ కు గెస్ట్ జడ్జ్ గా హాజరు అయ్యి అక్కడ ఫన్ అండ్ మోర్ ఫన్ ను క్రియేట్ చేశాడు.

తెలుగు ఇండియన్ ఐడల్ కు జడ్జ్ లు గా తమన్.. నిత్యా మీనన్ మరియు కార్తీక్ లు వ్యవహరిస్తూ ఉండగా శ్రీరామ చంద్ర హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ టాప్ 6 కంటెస్టెంట్స్ స్పెషల్ ఎపిసోడ్ కు బాలకృష్ణ గెస్ట్ గా వచ్చాడు. బాలయ్య తో పాటు ఉషా ఉతప్ కూడా తెలుగు ఇండియన్ ఐడల్ లో సందడి చేయడం జరిగింది.

ఆరుగురు కంటెస్టెంట్స్ తో బాలయ్య ఇంట్రాక్ట్ అయిన తీరు మరియు వారితో మాట్లాడిన ముచ్చట్లు.. షో ఆరంభంలో మరియు చివర్లో కంటెస్టెంట్స్ తో సరదాగా బాలయ్య వ్యవహరించిన తీరు తో ఎపిసోడ్ కు మంచి హైప్ వచ్చింది. ఆ ప్రోమోలకే మంచి టాక్ వచ్చింది. తాజాగా ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు.

బాలయ్య ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేయడం జరిగింది. బాలయ్య ఎపిసోడ్ కంటే బెస్ట్ గా మెగా ఎపిసోడ్ కు రన్ టైమ్.. వ్యూస్ వస్తాయా అనేది చూడాలి.