బిగ్‌బాస్‌ తెలుగు-5 : కుస్తీ పోటీలను మించి పోయిన కెప్టెన్సీ టాస్క్‌ – ఎపిసోడ్ -11

బిగ్ బాస్ రెండవ వారం కెప్టెన్సీ టాస్క్‌ కుస్తీ పోటీలను తలపించాయి అనడంలో సందేహం లేదు. గత నాలుగు సీజన్‌ లలో ఏ సీజన్ కంటెస్టెంట్స్ కూడా మరీ ఇంత వైలెంట్‌ గా వ్యవహరించిన దాఖలాలు లేవు. మరీ రెచ్చి పోయి మరీ కొట్టుకునే వరకు వెళ్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అంతా కూడా ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాటల యుద్దం చేసుకుంటున్నారు. ఎల్లో మరియు బ్లూ టీమ్స్ జట్లు పోటా పోటీగా ఆట ఆడుతున్నాయి. పంథం నీదా నాదా లో భాగంగా పిల్లోలను కాపాడుకుంటూ ప్రత్యర్థి జట్టు పిల్లోస్ ఉ తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాలి. అందుకోసం జట్టు సభ్యులు ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు టీ షర్ట్‌ ల్లో పిల్లోస్ పెట్టుకుంటే అందులో నుండి తీసేందుకు ప్రయత్నించారు. కొందరు అమ్మాయిలు టీ షర్ట్ లో చేతులు పెట్టి మరీ వాటిని తీసుకునేందుకు ప్రయత్నించారు. మొత్తానికి పిల్లోస్ గొడవ తారా స్థాయికి చేరింది.

ఇక సాగర సోదర టాస్క్‌ లో భాగంగా ఎల్లో టీమ్‌ గెలిచినా కూడా శ్రీరామ చంద్ర మరియు అతడి టీమ్ సభ్యులు దాన్ని మేము పరిగణలోకి తీసుకునేది లేదు.. శ్వేత తన చేతులు కింద పెట్టడం వల్ల ఓడిపోయారు అంటూ విమర్శించాడు. సాగర సోదర టాస్క్ లో ఇద్దరు టీమ్ లీడర్లు ఏకాభిప్రాయంతో ఏ జట్టు గెలిచింది అనేది చెప్పలేదు. శ్రీరామ చంద్ర జట్టు సభ్యులు మరియు ఆయన ఎల్లో గెలిచినట్లుగా ఒప్పుకోలేదు. కాని ఎల్లో టీమ్ కెప్టెన్‌ మానస్ వెళ్లి చెప్పే ప్రయత్నం చేసే బిగ్ బాస్ అందుకు ఒప్పుకోలేదు. ఇద్దరు ఏకాభిప్రాయంకు రాని కారణంగా టాస్క్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. బిగ్ బాస్ లో టాస్క్‌ రద్దు అవ్వడం అంటే సిగ్గు పడాలి అంటూ రవి చేసిన వ్యాఖ్యలకు శ్రీరామ చంద్ర మాకు సిగ్గు పడాల్సిన అవసరం లేదు మీరు సిగ్గు పడండి అంటూ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడాడు. రవితో మాట్లాడిన సమయంలో శ్రీరామ చంద్ర మాట్లాడుతూ నాకు 50 లక్షలు వచ్చినా వారి మొహాన కొట్టేస్తా.. నాకు అవసరం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తాజా ఎపిసోడ్ లో ప్రత్యేకంగా నిలిచాయి.

ఇక ఎల్లో కెప్టెన్‌ మానస్.. బ్లూ కెప్టెన్‌ శ్రీరామ చంద్రల మద్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త సీరియస్ గానే అయ్యింది. నీ వయసు 28 నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి నీకు మెచ్యూరిటీ రాలేదు అంటూ శ్రీరామ చంద్ర వ్యాఖ్యలు చేయడంతో నీకు వయసు వచ్చినా నీకు మెచ్యూరిటీ రాలేదు అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి ఇద్దరు కెప్టెన్ ల మద్య తీవ్ర మాటల యుద్దం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్లీ మళ్లీ పిల్లోస్ కోసం కుస్తీ పోటీలు జరిగాయి. చివరకు ఎక్కువ పిల్లోస్ ఉన్న కారణంగా ఎల్లో టీమ్‌ ను విజేతగా ప్రకటించడం జరిగింది. టాస్క్ ముగిసినా కూడా ఇంటి సభ్యులు అదే కసితో ఉన్నారు. ఇక లోబో అనారోగ్యంతో ఉన్నాడు. ఆట ఆడలేక పోతున్నందుకు కన్నీరు పెట్టుకున్నాడు. తన కుటుంబంకు ఎవరు లేరు.. నేనే వారిని చూసుకోవాలంటూ ఆడక పోయినందుకు క్షమాపణ చెప్పాడు. ఇక తదుపరి ఎపిసోడ్‌ లో కెప్టెన్సీ ఫైనల్ టాస్క్‌ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.