ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఏపీకి విభజన హామీ అయిన ప్రత్యేక హోదాను సాధించేంత వరకు పోరాటం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ అంశంపై సీఎం జగన్ పలు దఫాలుగా కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నారని అన్నారు. ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

ఏపీ రాజధాని అంశంపై మాట్లాడుతూ.. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమని అన్నారు. రాజధాని ఎక్కుడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని.. కేంద్రం కూడా అదే చెప్పిందని మంత్రి అన్నారు. పరిపాలనా రాజధాని విశాఖకు వచ్చితీరుతుందని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లులో లోపాలు సవరించి.. కొత్త బిల్లుతో ముందుకొస్తాం. వచ్చే సమావేశంలో చర్చించేందుకు సబ్‌ కమిటీ తొమ్మిది అంశాలతో కేంద్ర హోంశాఖ తయారు చేసిన ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండగా.. తర్వాత వెనక్కు తీసుకుంది.

Share