కేసీఆర్ పైనే తొడగొట్టిన ఈటల

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందుగానే ఈటల రాజేందర్ మొదలెట్టాడు. కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. తన ప్రత్యర్థి ఎవరైనా సరే కేసీఆర్ పాలనను వ్యక్తిత్తవాన్ని టార్గెట్ గా చేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే అస్త్రంతో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను కొట్టడానికి ట్రై చేస్తున్నాడు.

హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల హాట్ కామెంట్స్ చేశారు. ‘నీకు దమ్ము ఉంటే రా.. ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం.. నా ఆత్మగౌరవముంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జన చైతన్యాన్ని ఆపడం నీ జెజమ్మ వల్ల కూడా కాదంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ సవాల్ చేశారు. యువతనే తమ ఆయువు పట్టు అని.. వారు ప్రతి కుటుంబంలో ఉన్నారని.. వారే టీఆర్ఎస్ ను ఓడిస్తారన్నారు.

తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడే బాధ్యత హుజూరాబాద్ ప్రజలపై ఉందని కొత్త నినాదాన్ని ఈటల అందుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి మానుకోట ఆయువు పోస్తే.. ఇప్పుడు హుజూరాబాద్ 2023 ఎన్నికల పతనానికి నాంది పలుకుతుందని ఈటల సమర శంఖం పూరిస్తున్నారు.

2023 తర్వాత నీ ప్రభుత్వం రాదు.. మాయి గొప్ప ప్రణాళికలు ఉంటాయి అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. మంత్రికే కేసీఆర్ ను కలవడానికి టైం లేదని.. ఒక సామాన్య మనిషికి ఈ సీఎం దొరుకుతాడా? అని కేసీఆర్ వ్యక్తిత్వంపైన కూడా ఈటల దాడి మొదలుపెట్టాడు.

మరి ఈ కొత్త సంగ్రామం ఎటువైపు దారితీస్తుంది? ఈటల ఎత్తులకు కేసీఆర్ ఎలాంటి పైఎత్తులు వేస్తాడన్నది ఆసక్తిగా మారింది.