కియరా అంటేనే భయపడిపోతున్న తెలుగు నిర్మాతలు..!

‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. ‘MS.ధోని’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుని వెంటనే రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా పరాజయం చెందిన తర్వాత కియారా మరో తెలుగు సినిమాలో నటించలేదు. అయినా సరే అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూకుడు మీదున్న కియరా అద్వానీని మళ్ళీ టాలీవుడ్ కి తీసుకురావాలని ఇక్కడి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే అమ్మడి డిమాండ్ చేసే రెమ్యూనరేషన్ చూసి ప్రొడ్యూసర్స్ భయపడి పోతున్నారట. చేసినవి రెండు సినిమాలే అయినా ఈ బ్యూటీ తెలుగులో నటించడానికి దాదాపుగా రెండున్నర కోట్లు అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలావుండగా కియరా ఇప్పుడు చరణ్ తో మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అయిందని ప్రచారం జరుగుతోంది. శంకర్ – చరణ్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా ‘#RC15’ లో అమ్మడినే హీరోయిన్ గా తీసుకోనున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.