Karthika Deepam Serial December 16th Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 678 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 679 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (డిసెంబర్ 16) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో ముందుగానే మీకోసం.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

ఆదిత్య, శ్రావ్యలు దీపని చూడ్డానికి దీప ఇంటికి వస్తారు. సౌర్య బుక్స్ కొనుక్కోవడానికి అని దీపకు అబద్దం చెప్పి.. వారణాసిని తీసుకుని.. దుప్పట్లు పంచిపెడుతున్నారంటే అక్కడకు వెళ్తుంది. అయితే అలా పంచేది హిమ కార్తీక్, సౌందర్యలే కావడం.. సౌర్య అలా చేతులు చాచి అర్థించడం నచ్చని సౌందర్య ఆవేశం తెచ్చుకుని, సౌర్యని లాక్కెళ్లి దుప్పట్లు కొని, దీప దగ్గరకు తీసుకెళ్లి తిట్టడం, తర్వాత అంతా ఇక్కడే తినడానికి కార్తీక్‌ని కూడా ఒప్పించడం వరకూ జరిగింది.

సౌర్య హడావుడి

వారణాసి, సౌర్య, హిమ ముగ్గురు కూర్చుని.. వంటకు కావాల్సిన సామాన్లు రాస్తుంటారు. ‘డాడీకి చికెన్ లెక్ పీసెస్ అంటే ఇష్టం వారణాసి’ అంటుంది హిమ. వెంటనే సౌర్య.. ‘రేయ్ రాసుకోరా’ అంటుంది ఆనందంగా. ‘మటన్ కర్రీ, ఎగ్ ఫ్రై, ఫిష్ పులుసు, మజ్జిగ చెట్నీ అంటే మా డాడీకి చాలా ఇష్టం. ఇంకా మా ఫ్యామిలీకి నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం’ అంటుంది హిమ. దాంతో సౌర్య.. ‘అమ్ములక్కా కోళ్ల బ్యాచ్‌లో ఓ కోడి నీలా(వారణాసిలా)గే బాగా బలిసిపోయింది. దాన్ని కొనేద్దాం, రా రా’ అంటూ సౌర్య వారణాసి తీసుకుని వెళ్తుంది.

వయ్యారాలు పోతూ ఫోన్ చేయండమ్మా!

మౌనిత కూడా కార్తీక్ ఇష్టమైనవన్నీ చెప్పి.. తయారు చేయమని ప్రియమణి(పనిమనిషి)కి చెబుతుంది. ‘అమ్మో ఇవన్నీనా? ఒక్కద్దాన్నే ఇన్నంటే కష్టమమ్మా.. మీరూ సాయం చేయండి’అంటుంది ప్రియమణి. ‘సాయం ఏంటే నాకు నేర్పిస్తాను అన్నావుగా.. నేర్పించు.. కావాల్సినవన్నీ తరిగిపెట్టు. వచ్చి గరిటె తిప్పేస్తాను. ఇవాళ కార్తీక్‌ని భోజనానికి రమ్మని పిలుస్తా’అంటుంది మౌనిత. ‘మంచి వంటకి పడిపోని మగాడు ఉండడమ్మా.. వంట కాగానే.. వయ్యారాలు పోతూ ఫోన్ చేయండి’ అంటుంది ప్రియమణి. ఆ మాటలకు మౌనిత తనలో తనే చాలా సంబరపడిపోతుంది.
దీప ఇంట్లో అడుగుపెట్టిన కార్తీక్

కార్తీక్ కోసం.. శ్రావ్య, ఆదిత్య, సౌందర్య, దీపా అంతా ఎదురు చూస్తూ ఉంటారు. డాక్టర్ బాబు లోపలికి వస్తారంటారా అత్తయ్యా?’ అంటుంది టెన్షన్‌గా దీప. ‘వస్తాడు.. రాకుండా ఎక్కడికి పోతాడు?’ అంటుంది నవ్వుతూ. ‘అంత కరెక్ట్‌గా ఎలా చెబుతున్నారు అత్తయ్యా?’ అంటుంది దీప అనుమానంగా. ‘వాడు నీకు మొగుడు కాకముందే నాకు కొడుకు కదా’ అంటుండగా.. కార్తీక్ నీడ కనిపించి.. ‘బావగారు వస్తున్నారు’ అంటూ శ్రావ్య లేచి నిలబడుతుంది. కార్తీక్ కాలు పెట్టాలా వద్దా అన్నట్లుగా ముందుకు వెనక్కి ఆలోచిస్తుంటే.. ‘లేట్ చేస్తే హారతి వస్తుంది సుపుత్రా’ అంటుంది సౌందర్య. దాంతో మొత్తానికి కాలు పెడతాడు. దాంతో దీప, శ్రావ్య, ఆదిత్యలు చాలా సంతోషిస్తారు. తీరా కార్తీక్ శ్రావ్య, ఆదిత్యలను చూసి.. షాక్ అవుతాడు.

సౌందర్యపై ఫైర్

‘ఓహో.. పీఎం విజిటింగ్ కోసం కూడా ఇంత పగడ్భందీగా ప్లాన్ చేయరేమో’ అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య.. ‘బుర్ర ఉన్నవాడు ఎవ్వడూ కూడా అలా మాట్లాడడు. మనమే అనుకోకుండా వచ్చాం. వీళ్లు(శ్రావ్య, ఆదిత్యలు) కూడా అలానే వచ్చారు’అంటూ తిడుతుంది. అయినా సరే సౌందర్యని నిందించే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. దాంతో శ్రావ్య మాట్లాడుతూ.. ‘అక్కని చూడాలనిపించి నేనే ఆదిత్యని తీసుకుని ఇక్కడికి వచ్చాను బావగారు. అత్తయ్యకు దీనికి ఏ మాత్రం సంబంధంలేదు’ అంటుంది. అయితే కార్తీక్ మాత్రం కోపంతో రగిలిపోతాడు.

నా జోలికి రావద్దని చెప్పు

దీప కార్తీక్‌తో.. ‘కూర్చోండి డాక్టర్ బాబు’ అంటుంది. ‘రాజమాతలా కూర్చుని ఏం ప్లాన్స్ చేస్తున్నావ్ మమ్మీ? అయినా నేను ఇక్కడ కూర్చోవాలా? సింహాలు పులులు ఉన్న చోట పాకే పసివాడిలా నేను ఇక్కడ కూర్చోలేను’ అంటాడు కార్తీక్. ‘హూ.. పాకే పసివాడు పాలు తాగుతాడేమో అడుగు పెద్ద కోడలా’ అంటూ సెటైర్ వేస్తుంది సౌందర్య. కోపంగా వెనక్కి వెళ్లబోతున్న కార్తీక్‌కి ఎదురుగా హిమ కొత్తి మీర కట్ట తీసుకుని వస్తూ కనిపిస్తుంది. చేసేది లేక అదే గుమ్మం ముందు కోపంగా కూర్చుంటాడు కార్తీక్. అది చూసిన దీప షాక్ కాకా.. సౌందర్య మాత్రం.. ‘ఎలా కూర్చున్నాడో చూడు.. హిరణ్యకసుపుడ్ని చీల్చి చెండాడిన నరసింహమూర్తిలా గడపలా కూర్చున్నాడు’ అంటుంది. వెంటనే కార్తీక్.. ‘ఆ చెంచులక్ష్మి(దీప)ని మాత్రం నా జోలికి రావద్దని చెప్పు’ అనడంతో సౌందర్య, ఆదిత్యలకు నవ్వు వస్తుంది. దీప కాస్త ఇబ్బందిగా చూస్తుంది. ఇంతలో హిమ.. నవ్వుతూ.. ‘ఇవేంటో లీవ్స్ బంచ్ అట డాడీ సరోజక్క వంటలక్కు ఇవ్వమంది.. వీటిని ఏం అంటారు డాడీ?’ అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ లోపల ఉన్న దీప వైపు కోపంగా చూస్తూ కొత్తిమీర కట్టా అంటారు అంటాడు. అప్పుడు కూడా సౌందర్య, ఆదిత్యలు నవ్వుని ఆపుకుంటారు.

ఈ చేయి భస్మాసురుడి చేయి

మౌనిత ఉల్లిపాయలు కట్ చేస్తూ ‘ఎలా కట్ చేస్తారే ఈ ఉల్లిపాయలు?’ అంటూ ఏడుస్తుంది. ప్రియమణి.. నవ్వుతూ.. ‘అమ్మా కార్తీకయ్యా మీరు రాత్రి నా కలలోకి వచ్చారమ్మా.. మీరు ఉల్లిపాయల వడ్డాణం, దండా పెట్టుకుని.. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ డాన్స్‌లు చేస్తున్నారమ్మా’ అంటుంది. ‘సొల్లు చెప్పింది చాలా’ అంటూ నవ్వుతుంది మౌనిత. అయితే.. ప్రియమణి మాత్రం.. ‘నిజమమ్మా.. కావాలంటే మీ మీద ఒట్టు’ అంటూ మౌనిత తల మీద చేయి పెట్టబోతుంది. వెంటనే అడ్డుపడి.. విలన్‌లా నవ్వుతూ.. ‘ఇంకొకరి తల మీద చేయి పెట్టాలంటే.. నేనే పెట్టాలి.. ఇది భస్మాసురుడి చేయే’ అంటుంది. వెంటనే ‘వస్తాడు నా రాజు ఈ రోజు.. రానే వస్తాడు నా రాజు’ అంటూ పాడ పాడుతూ కూరగాయలు కట్ చేస్తుంది. వెంటనే ప్రియమణి.. ‘ముందు మీ రాజు ఎక్కడున్నాడో తెలుసుకోండమ్మా’ అంటే.. ‘ఎక్కడున్నా నా రాజు నేను పిలిస్తే వస్తాడు. మా అత్తగారే(సౌందర్య) ఉల్లి రేట్లా భగ్గుమంటుంది. అయినా ఈ మౌనిత అన్నింటికీ తెగించేసిందే. ఎవ్వరికీ భయపడదు’ అంటుంది.

ఆనందరావు ఎంట్రీ!

సౌర్య కావాల్సినవన్నీ తెస్తుంది. కార్తీక్ తప్ప.. అంతా నవ్వుతూ.. సౌందర్య చేసిన గారెలు తింటూ ఉంటారు. వెంటనే సౌందర్య కాస్త బాధగా.. ‘అంతా ఉన్నారు.. మీ నాన్న మాత్రం ఇంట్లో ఉన్నారు.. ఫోన్ చేసి పిలవరా చిన్నోడా’ అంటుంది ఆదిత్యతో.. వెంటనే ఆనందరావు.. ‘అవసరం లేదు’అంటూ నవ్వుతాడు. ‘వాటే వండర్? తలుచుకోగానే వచ్చేశారేంటీ ఆనందరావు గారూ’ అంటుంది సౌందర్య. ‘మీరు పిలవకపోయినా నా మనవరాలు ఫోన్ చేసి పిలిచిదిలే’ అంటాడు ఆనందరావు సౌర్యని చూపిస్తూ.. దాంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.

వాటే కామెడీ!

‘హిమా మీ డాడీని అడిగావా?’ అంటుంది. ‘అడగలేదు’ అంటుంది హిమ. ‘నేను అడుగుతానులే’ అంటూ బయలు దేరుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. కంగారు పడతారు. ఇంతలో హిమ.. ‘ఏం అడుగుతుందో మీరే విందురుగానీ’ అంటూ చాటుగా కిటిలోంచి వినిపిస్తుంది హిమ. సౌర్య కార్తీక్ దగ్గరకు వెళ్లి.. ‘డాక్టర్ బాబూ వారణాసి ఉన్నాడు.. ఇంకా షాపులు మూసి ఉండరు.. ఈ ఒక్కరోజుకి మీరు కింద పడుకోండి. హిమ పైన పడుకుంటుంది(మందు తాగండి)’ అని అంటుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. అర్థం చేసుకుని కోపంతో.. ‘ఏంటే రౌడీ..? ఇంకోసారి ఇలాంటివి అడిగితే చెవి కోసి చేతిలో పెడతా’ అంటూ ఫైర్ అవుతాడు. లోపల నుంచి చాటుగా చూస్తున్న వాళ్లంతా పడిపడి నవ్వుతారు. ఆ నవ్వులు వినిపించి కార్తీక్ వాళ్లని కూడా కోపంగా చూస్తాడు. వెంటనే అటు చూనట్లేనట్లుగా బిల్డప్ కొడతారు అంతా. దీప మాత్రం మౌనంగానే ఉంటుంది.

భాగ్యం కంగారు.. మౌనిత సంబరాలు

దీప ఇంటికి అంతా వెళ్లారని తెలుసుకున్న భాగ్యం.. శ్రావ్యకి ఫోన్ చేసి.. ‘ఏంటే శ్రావ్య నవ్వుతున్నావ్? అక్కడేం గొడవ జరగడం లేదా? మీ బావగారు గోడని గుద్దుతూ.. ‘తప్పు చేశావ్ చేశావ్..’ అంటూ అరవడం లేదా?’ అంటూ పిచ్చి ప్రశ్నలు వస్తుంది. దాంతో శ్రావ్య అంతా కూల్‌గా ఉందని చెప్పి.. ‘కాస్త తిని పడుకో మమ్మీ’ అంటుంది. ఇక్కడ మౌనిత.. సంబరపడిపోతూ.. ప్రియమణి చేసిన వంటలన్నీ తనే చేసినట్లుగా బిల్డప్ కొడుతూ.. వంటలన్నింటికీ ఫొటోలు తీసుకుని.. కార్తీక్‌ని భోజనానికి రమ్మనడానికి.. కార్తీక్‌కి వీడియో కాల్ చేస్తుంది.

కమింగ్ అప్‌లో…

సీన్ కట్ చేస్తే.. ఫోన్ హిమ దగ్గర ఉండటంతో.. ‘వంటలక్కా ఆ మౌనిత కాల్ చేస్తోంది. డాడీ చూస్తే మొన్నట్లే మధ్యలోంచి వెళ్లిపోతాడు’ అంటూ దీపకు ఇస్తుంది. దీప ఫోన్ లిఫ్ట్ చేయడంతో.. మౌనిత షాక్ అవుతుంది. ‘కార్తీక్ ఫోన్ నీ దగ్గర ఉందేంటీ?’ అంటుంది టెన్షన్‌గా.. ‘ఆయనే నా దగ్గర ఉన్నారు. ఆయనే కాదు.. నా అత్తింటి వాళ్లంతా నా దగ్గరే నా ఇంట్లోనే ఉన్నారు.. చూస్తావా?’ అంటూ అందరినీ చూపిస్తుంది. దాంతో మౌనిత ఆందోళనతో.. అయిష్టంగా చూస్తూ.. షాకింగ్‌గా ఉండిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది.