ఒకే కార్యక్రమంలో కొడాలి నాని, వంగవీటి రాధ

రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మంత్రి కొడాలి నాని మరియు తెలుగు దేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఇద్దరి మద్య వాతావరణం ఎలా ఉంటుందో అనే అనుమానాలు అంతా వ్యక్తం అయ్యాయి. అయితే ఇద్దరు కూడా ఎదురు పడ్డ సమయంలో పలకరించుకోవడంతో పాటు పలు విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగిందట. ఈ విషయాన్ని ఇద్దరు నాయకుల సన్నిహితులు మీడియా వర్గాల వారికి చెబుతున్నారు.

గుడివాడ నాయకుడు పాలేటి చంటి మనవడి జన్మదినం సందర్బంగా కే కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరిద్దరు హాజరు అయ్యారు. కార్యక్రమం ప్రారంభంకు ముందు కొద్ది సమయం గెస్ట్ హౌస్ లో వీరిద్దరు కలిశారు. ఆ సమయంలో వీరిద్దరు కూడా రాజకీయాలు ఇతర విషయాల గురించి మాట్లాడటం జరిగింది. రాబోయే కాలంలో పార్టీ మారే విషయాల నుండి మొదలుకుని ప్రస్తుత రాజకీయాల వరకు అనేక విషయాలను మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.