దసరా బరిలో ఆ రెండూ సత్తా చాటుతాయా?

కరోనా మహమ్మారీ క్రైసిస్ భయాలు పూర్తిగా తొలగిపోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఇప్పటికి ప్రజల్లో చాలా వరకూ ఆందోళన తగ్గింది. పబ్లిక్ ప్లేసుల్లో జనం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ పాటించి తీరాల్సిన సన్నివేశం ఉంది. ఇంకా థర్డ్ వేవ్ ముప్పు లేకపోలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు జనం పబ్లిక్ ప్లేసులకు వెళ్లడంతో పాటు సినిమా థియేటర్ల వైపు నడవాల్సి ఉంటుంది.

సినిమాలకు దసరా చాలా ఇంపార్టెంట్. ఈ శుక్రవారం (15 అక్టోబర్) దసరా సందర్భంగా ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ బరిలో ఉన్నాయి.

దసరా సీజన్ తో పాటు థియేటర్స్ వైపు జనాల్ని చూసేలా చేసే సినిమాలు ఇప్పుడు రాబోతున్న మహాసముద్రం- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అని టాక్ నడస్తోంది. సెకండ్ వేవ్ తరువాత బజ్ ఉన్న సినిమాలు వచ్చాయి.. కానీ అవేవి కథ పరంగా ఆడియెన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. నాగచైతన్య- శేఖర్ కమ్ములు కాంబినేషన్ మూవీ లవ్ స్టోరి క్రిటిక్స్ ప్రశంసలతో పాటు వసూళ్ల పరంగా ఆశించిన రిజల్ట్ ని అందుకుందన్న టాక్ వినిపించింది.

ఈ సినిమా మినహా ఇంకేవీ ఆకట్టుకోలేదు. స్టోరీతో పాటు ఇప్పుడు బజ్ కూడా తెచ్చుకున్న సినిమాలు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` .. `మహాసముద్రం` విడుదలకు రెడీ అయ్యాయి. మరి ఈ రెండు సినిమాలు ఆడియెన్స్ ని ఎలా ఎంటర్ టైన్ చేస్తాయో చూడాలి. లవ్ స్టోరి లా పాజిటివ్ టాక్ రావాలి. ఉప్పెన – జాతిరత్నాలు లా మంచి రిజల్ట్ ని అందుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి. పెద్ద క్రైసిస్ తర్వాత ఇప్పుడు బాక్సాఫీస్ కి కళ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అఖిల్.. భాస్కర్ కంబ్యాక్ అవ్వాలన్న కసితో పని చేశారు. అలాగే మహాసముద్రం చిత్రంతో అజయ్ భూపతి సత్తా చాటేందుకు శ్రమించారు. హీరో సిద్ధార్థ్ కి ఇది కంబ్యాక్ మూవీ. శర్వాకి బ్రేక్ కావాలి. అందువల్ల ఈ సినిమాపైనా అందరి ఫోకస్ ఎక్కువే ఉంది. మరి దసరా బరిలో ఎవరి గేమ్ ఎలా ఉండనుందో కాస్త వేచి చూడాలి.