మమత, స్టాలిన్‌ ల వైపే జనాలు

దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో నిన్న చివరి దశ ఎన్నికలు ముగిశాయి. దాంతో అయిదు అసెంబ్లీలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను మీడియా సంస్థలు ప్రకటించాయి. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పశ్చిమ బెంగాల్‌ మరియు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేసింది. కాని ఆ పార్టీకి పెద్దగా ఆ రెండు రాష్ట్రాల్లో అవకాశం దక్కనట్లే కనిపిస్తుంది.

పశ్చిమబెంగాల్ లో పూర్తి ఆధిపత్యంను తృణముల్‌ కాంగ్రెస్‌ కనబర్చింది. మూడవ సారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాన స్వీకారం చేయడం ఖాయం అంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల వారు అంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అదే చెబుతోంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ అధికారం దక్కించుకోవాలని ప్రయత్నించింది. కాని స్టాలిన్ ఆధ్యంలోని డీఎంకే పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చాయి. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉన్నట్లుగా కనిపించడం లేదని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.