‘మా’ గొడవ మళ్లీ మొదలైంది .. ఇప్పుడు మనోజ్ వంతు

`మా` అసోసియేషన్ ఎన్నికలు ఏ స్థాయిలో రచ్చకు తెర లేపాయో అందరికి తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ పోటీపడ్డాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు తారా స్థాయిలో పేలి రాజకీయ ఎన్నికల తరహాలో సంచలనం సృష్టించాయి. ఇక ఈ పోటీ ప్రధానంగా మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ గా సాగినా అంతర్లీనంగా మాత్రం మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ గానే సాగాయి. బాహాటంగా మెగా బ్రదర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు సపోర్ట్ చేయగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ ని సమర్ధించారు.

`మా` ఎన్నికల వేళ మంచు విష్ణు కూడా చిరుపై కామెంట్ లు చేశారు. తనని చిరంజీవి పోటీ నుంచి తప్పుకోమన్నారని మీడియా ముఖంగా చెప్పడంతో తెరవెనుక అసలు కథ మొదలైందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకున్నాయి. ఇదే సమయంలో మంచు వారికి అండగా నటుడు నరేష్ రంగంలోకి దిగారు. వెనకుండి చక్రం తిప్పారు. ప్రతీ ఒక్కరికీ మంచు విష్ణు చేత స్వయంగా ఫోన్ లు చేయించి మరీ ఓట్లు అడిగించారు. దీంతో ప్యూహం ఫలించింది ఎన్నికల అనంతరం మంచు విష్ణు `మా`అధ్యక్షుడయ్యారు.

అయితే ఆ తరువాత కూడా నాగబాబు మంచు ఫ్యామిలీపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. మంచు విష్ణు పై నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసిన సందర్భంగా కూడా మంచు విష్ణుని నెటిజన్ లు ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఇక అంతా కూల్ అనుకుంటున్న వేళ `మా` వివాదం మళ్లీ మొదలైంది. తాజాగా మంచు మనోజ్ `మా` ఎన్నికలపై.. ఆ సమయంలో మెగా బ్రదర్ వ్యవహరించిన తీరుపై ఇండైరెక్ట్ గా మంచు మనోజ్ సెటైర్లు వేయడంతో మళ్లీ వివాదం మొదటి కొచ్చింది.

తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఇందు కోసం భారీ వేడుకని ఏర్పాటు చేశారు. ఈ వేదిక సాక్షిగా మంచు మనోజ్ `మా` ఎన్నికల ప్రస్థావన తీసుకొచ్చారు. `మా` ఎలక్షన్ జరిగింది అంటూ నవ్వుతునూ మొదలుపెట్టి పోటీ అంటే రెండు పక్కలా వుంటుంది. ఒకరిద్దరు పోటీచేశారు. రెండు వర్గాల వారు మీకు ఓటేయండి అంటే మాకు వోటేయండి అంటూ సభ్యులని అడిగారు. అయితే జనాలంతా కలిసి ఒక వ్యక్తికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ నిర్ణయం ప్రకారమే మా ప్రెసిడెంట్ గా వుంటే బాగుంటుందని మా అన్నని ఎంపిక చేసుకున్నారు. అక్కడితే అంతా ఓకే. ఇండస్ట్రీలో ఎవరు ఎవరికి శత్రువులు కారు.. ఎవరికి ఎవరు హాని చేసుకోలేదు. అయితే ఓ వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి ప్రతీసారి ఏదో విధంగా ఇబ్బంది పెడదాం అని ఏదో ఒకటి అంటూనే వున్నారు. అన్నయ్యా పట్టించుకోలేదు. నాన్నగారూ పట్టించుకోలేదు. ఎలాక్షన్ అయింది. రిజల్ట్ వచ్చింది. మాకు సపోర్ట్ చేసిన వాళ్లని కూడా వయసుతో సంబంధం లేకుండా బూతులు తిట్టి అవమానించారు. అదంతా మీకు తెలిసిందే.

వాళ్లు ఎందుకు చేశారని ఆలోచిస్తుంటే నాన్న ఒకటే అన్నారు పాపం అతనికి హయ్యర్ పసర్పస్ తేదురా వదిలేయ్ అన్నారు. కరెక్టే కదా అనిపించింది. అతని చుట్టూ ఆచించిన తరువాత అతని చుట్టూ గొప్ప గొప్పవాళ్లున్నారు. కానీ ఆయన మాత్రం ఏమీ లేకుండా వుండిపోయారు. నేను ఏం చెబుతున్నానంటూ లైఫ్ లో హయ్యర్ పర్పస్ లేకపోతే జీవితం చాలా బ్యాడ్ గా వుంటుంది` అని మంచు మనోజ్ మెగా బ్రదర్ నాగబాబు పేరెత్తకుండానే సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మెగా బ్రదర్ ఎలా స్పందిస్తారో చూడాలి.