Mounaraagam Serial December 9th Episode Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్‌ 384 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 385 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (డిసెంబర్ 9) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…
స్నేహా భరత్ దగ్గరకు వెళ్లి తాళి కట్టమని నిలదీయడంతో.. భరత్ తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు. ‘నేను అంకిత్‌కి చెప్పిన అబద్దానికి నువ్వు. నేను ఇప్పటికీ అమ్ముల్నే ప్రేమిస్తున్నాను. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. అమ్ములు అంకిత్‌లను కలుపుతానన్న మాటలు అబద్దం’ అంటూ అరుస్తాడు. దాంతో స్నేహా అక్కడనుంచి ‘నువ్వు తప్పకుండా బాధపడతావు’ అంటూ వెళ్లిపోతుంది. దాంతో భయపడిన భరత్.. రౌడీని స్నేహ వెనుకే పంపించి.. ‘అది సీనయ్య గారిని కలిస్తే చంపేయ్’ అంటాడు. మరోవైపు అమ్ములు లక్కీకి భరత్ నిజస్వరూపం గురించి బొమ్మలు చూపించి.. స్నేహాని కాపాడటానికి బయలుదేరుతుంది. అంకిత్ కూడా స్నేహా కోసం వెతుకుతూ ఉంటాడు.

385 ఎపిసోడ్ హైలెట్స్..
లక్కీ అమ్ములు గీసిన బొమ్మలన్నీ నీలవేణికి, కాంతమ్మకు చూపిస్తుంది. ‘భరత్ ఇలాంటి వాడు కాదు’ అంటూ కాంతమ్మ వాదిస్తుంటే.. అక్కడే ఉన్న వసంత.. ‘నేను భరత్ గురించి ఎంత చెప్పినా విన్నాకు కాదు.. ఆ స్నేహాకి భరత్‌కి మధ్య ఏదో జరుగుతుందని నేను చెబుతూనే ఉన్నాను’ అంటుంది. ఇంతలో సీనయ్య రావడంతో అంతా షాక్ అవుతారు. లక్కీ చేతిలోని అమ్ములు గీసిన బొమ్మలు చూసి… ‘అంటే ఇన్నీ రోజు ఈ అనుమానం అమ్ములుదా? భరత్ అలాంటి వాడు కాదు. అదే మీకు నిరూపిస్తాను. ఇప్పుడే వెళ్లి.. స్నేహాని, భరత్ బాబుని తీసుకుని వస్తాను’ అంటూ సీనయ్య కూడా బయలుదేరతాడు.

స్నేహా భరత్ మాటలు తలుచుకుంటూ.. గోదావరి వైపు వేగంగా వెళ్లిపోతుంది. అడ్డుకున్న అంకిత్.. ‘ఏం జరిగింది’ అని నిలదీస్తాడు. దాంతో భరత్ అన్న మాటలను చెబుతుంది. ఇంతలో అమ్ములు కూడా అక్కడకి చేరుకుంటుంది. స్నేహకు క్షమాపణలు చెబుతుంది. దాంతో స్నేహా బాధపడుతూ.. ‘ఓ దుర్మార్గుడ్ని ప్రేమించి తప్పు చేశాను. అయినా భరత్ మనం అనుకున్నంత మంచివాడు కాదు. భరత్ గురించి అమ్ములుకి అన్ని నిజాలు తెలుసు’ అని అంకిత్, అమ్ములూల చేతులు కలిపి వెళ్లిపోతుంది. తర్వాత అంకిత్ అమ్ములు దగ్గర అన్ని నిజాలు తెలుసుకుని ఆవేశంగా భరత్ దగ్గరకు వెళ్తాడు.

ఆవేశంగా వెళ్లిన అంకిత్.. భరత్‌తో వాదిస్తాడు. ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ గొడవలో అంకిత్ తలకు దెబ్బ తగిలి పడిపోతాడు. అయితే భరత్ చూసే సరికి సీనయ్య ఆవేశంగా వెనక్కి వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో భరత్ మనసులో.. ‘అంటే ఇక్కడ జరిగింది అంతా తెలుసుకునే వెళ్లిపోతున్నాడని మాట’ అనుకుని.. రౌడీలకు ఫోన్ చేసి.. ‘రేయ్ సీనయ్యను వేసేయండ్రా.. ఇంటికి చేరుకోకూడదు’ అని చెబుతాడు. దాంతో కారుతో గుద్దేస్తాడు ఓ రౌడీ. సరిగ్గా అప్పుడే అటుగా వస్తున్న అమ్ములు కళ్ల ముందే తండ్రీ సీనయ్య అంతెత్తు ఎగిరి కింద పడతాడు. అది చూసి.. తండ్రి దగ్గరకు పరుగుతీస్తుంది. వడిలోకి తీసుకుని ఏడుస్తూ.. సీనయ్యను కదుపుతుంది. (అయితే ఇదంతా అమ్ములు కల కూడా కావచ్చు). మ‌రిన్ని వివ‌రాలు త‌రువాయి భాగంలో చూద్దాం. మౌన‌రాగం కొన‌సాగుతోంది.