ఎమ్మెల్యే రోజా దెబ్బకు నాగబాబు ‘బొమ్మ అదిరింది’

ఎమ్మెల్యే రోజా, నాగబాబు కలిసి జబర్దస్త్ షో ను చాలా సంవత్సరాలు విజయవంతంగా నడిపారు. అసలు ఒక కామెడీ షో ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. దాదాపు ఏడేళ్లు జబర్దస్త్ నెం 1 ప్రోగ్రాం గా నిలుస్తూ వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల నాగబాబు ఈ షో నుండి తప్పుకున్నాడు.

జీ తెలుగు ఛానల్ లో అదిరింది, బొమ్మ అదిరింది అంటూ కామెడీ షోస్ ను మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమాలకు నాగబాబు బ్యాక్ బోన్ గా నిలిచాడు. అయితే జబర్దస్త్ కు రోజా బ్యాక్ బోన్ గా నిలిచారు. నాగబాబు విడిచి వెళ్ళిపోయినా రోజా జబర్దస్త్ కు అన్నీ తానై వ్యవహరించారు.

ఇక టిఆర్పిల విషయానికొస్తే జబర్దస్త్ ఇంకా తన హవాను చూపిస్తోంది. బొమ్మ అదిరింది జబర్దస్త్ దెబ్బకు నిలవలేకపోతోంది. అసలు బొమ్మ అదిరింది షో ఆపేశారనే వార్త బయటకు వచ్చింది. ఈ రకంగా నాగబాబుపై రోజా పైచేయి సాధించింది. జబర్దస్త్ నుండి బయటకు వచ్చి నాగబాబు చేసిన ప్రయత్నం విఫలమైంది.