పెంగ్విన్ బాలేదు కానీ హిట్టే!

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విమర్శకులు, సగటు ప్రేక్షకులు పెదవి విరిచిన ఈ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో విడుదల అయితే, వచ్చిన వసూళ్లను బట్టి హిట్టా ఫట్టా తేల్చవచ్చు. మరి ఓటిటీలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినట్టా కాదా? కీర్తి సురేష్ పాపులారిటీకి తోడు ఈ చిత్రం పట్ల రేకెత్తిన ఉత్సుకత వల్ల పెంగ్విన్ చిత్రాన్ని పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు.

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలలో పెంగ్విన్ కి మొదటి వారాంతంలో వచ్చినన్ని వ్యూస్ మరే చిత్రానికీ రాలేదట. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, మలయాళంలో కూడా రిలీజ్ చేయడం కూడా ఇందుకు కారణం అనుకోవచ్చు. ఈ చిత్రం కోసం అమెజాన్ పెట్టిన పెట్టుబడి వర్కవుట్ అయిపోయిందట. అలాగే ఇక మీదట వచ్చే వ్యూస్ నుంచి నిర్మాతకు కూడా షేర్ వెళ్తుందట.

ఒక పాపులర్ హీరోయిన్ లేదా హీరో వుంటే, డిజిటల్ రిలీజ్ కి ఉండే అడ్వాంటేజ్ ఇది. సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా కానీ, ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది కనుక జనం అదేంటో చూడ్డానికే మొగ్గు చూపుతారు.