బ్యాచిలర్‌ ‘విభ’ ప్రత్యేకంగా ఉంటుందట

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను దసరా కానుకగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించినంత వరకు ప్రమోషన్ లో జోరు కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో వసూళ్లను దక్కించుకోవడంతో పాటు అఖిల్‌ కెరీర్ లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో పూజా హెగ్డే పాల్గొంటుంది. ఈ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర పేరు విభ. ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే ఈ సినిమాలోని పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. ప్రస్తుతం విభ పాత్రకు సంబంధించినంత వరకు ఆకట్టుకునే విధంగా పోస్టర్ లు మరియు వీడియోలు రిలీజ్ అయ్యాయి. మరి సినిమాలో ఎలా ఉంటుందో అనేది చూడాలి.

విభ పాత్ర ఒక స్టాండప్ కమెడియన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆమె నటించిన వివిధ సినిమాలకు సంబంధించిన పోస్టర్ లు విడుదల అయ్యే అవకాశం ఉంది.