10 కేజీఎఫ్‌ లకు పుష్ప పార్ట్‌ 1 సమానం

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా పార్ట్‌ 1 చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలో ఉప్పెన దర్శకుడు అయిన సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఉప్పెన సినిమా తో సక్సెస్‌ దక్కించుకున్న బుచ్చి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను పుష్ప సినిమాను చూశాను. పుష్ప ఒక్క సినిమానే 10 కేజీఎఫ్‌ సినిమాలతో సమానం అనిపించింది. హీరో ను చూపించిన విధానం మరియు దర్శకుడు సుకుమార్ గారి ఎలివేషన్ మరో లెవల్‌ లో ఉందని అన్నాడు. సుకుమార్ అద్బుతంగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారని మరో సారి క్లారిటీ వచ్చింది. బుచ్చి బాబు వ్యాఖ్యలతో సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.