ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం అమీర్‌ ఖాన్‌తో జక్కన్న చర్చలు

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఫిబ్రవరి లేదా మార్చి వరకు షూటింగ్‌ దాదాపుగా పూర్తి అవ్వనుంది. సినిమాను మరీ ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాది ఆగస్టు లేదా డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని వర్గాల వారు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. సౌత్‌ ఆడియన్స్‌ మరియు నార్త్‌ అడియన్స్‌ అంతా కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి అంచనాలను అందుకునేలా జక్కన్న సినిమాను తీస్తాడు అనడంలో సందేహం లేదు. జక్కన్న రాజమౌళి ఈ సినిమాను స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు గాను జక్కన్న అమీర్‌ ఖాన్‌ సాయంను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రామ రాజు మరియు కొమురం భీమ్‌ పాత్రలను అమీర్‌ఖాన్‌ పరిచయం చేశాడట. హిందీలో అమీర్‌ ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌ తో సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇక తెలుగు మరియు ఇతర సౌత్‌ భాషల్లో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ లు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.

కొమురం భీమ్‌ పాత్రకు రామ్‌ చరణ్‌, రామరాజు పాత్రకు ఎన్టీఆర్‌ తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించనున్నాడు. హిందీ స్టార్స్‌ ఆలియా భట్‌ మరియు అజయ్‌ దేవగన్‌ లు ఈ సినిమాలో నటించిన కారణంగా ఇప్పటికే సినిమాపై ఉత్తరాది అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఆ అంచనాలను మరింతగా పెంచేలా దర్శకుడు అమీర్‌ ఖాన్‌ ను రంగంలోకి దించుతున్నాడు.