రణబీర్-అలియా పెళ్లి కరోనాపై ఆధారపడిందా?

రణబీర్ కపూర్-అలియాభట్ ల పెళ్లి ఎప్పుడో జరిగిపోవాలి. సరిగ్గా చేసుకుందామని డిసైడ్ అయ్యే సరికి కరోనా ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్లగా వైరస్ వేరియేంట్లు ఎలా పట్టి పీడిస్తున్నాయో తెలిసిందే. ఫస్ట్ వేవ్ రాక ముందు జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వచ్చిన తర్వాత బ్రేక్ పడింది.

అటుపై సెకెండ్ వేవ్ సృష్టించిన మరణ మృందగంతో బెంబేలెత్తిపోవాల్సి వచ్చింది. దీంతో మూడో వేవ్ పై ప్రజలు ముందుగానే అప్రతమయ్యారు. కానీ థర్డ్ వేవ్ అంతగా ప్రభావం చూపలేదు. దీంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. వాళ్లలో ఈ జంట కూడా ఉంది. మరి ఇప్పుడైనా అలియా-రణబీర్ పెళ్లికి సిద్దమవుతున్నారా? అంటే లేదని తెలుస్తోంది.

పెళ్లిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తన మనసులో రణబీర్ తో ఎప్పుడో పెళ్లి జరిగిపోయినట్లు ఫిక్సైయ్యానని అలియా భట్ తెలిపింది. అంటే రణబీర్ తో ప్రేమలో పడినప్పుడే అలియాకి పెళ్లి అయిందని నిర్ణయించుకుంది. అప్పటి నుంచే రణబీర్ని భర్తగానే ఊహించుకున్నట్లు చెప్పకనే చెప్పింది.

మరి రణబీర్ ఏమంటున్నాడు. రణబీర్ కూడా అలాగే ఫీలవుతున్నాడు. కానీ తన పెళ్లి జరగాలంటే కరోనా మూలాలు పూర్తిగా పోవాలని చెప్పకనే చెప్పాడు. అలియాతో పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరగాలని తనకోసం ఊరు వాడ..పల్లె పట్టణం అంతా రావాల్సిందేనని అంటున్నాడు. తండ్రి రిషీ కపూర్ కోరిక మేరకు రణబీర్ అంత పట్టుగా ఉన్నాడు. మరి అలా జరగాలంటే కరోనా పోవాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది.

మరి కరోనా అంత వీజీగా పోతుందా? దాని మూలాలు ప్రజల్ని అంత సులభంగా వదిలిపెడతాయా? అంటే స్పష్టత లేదు. థర్డ్ వేవ్ లో అంత ప్రభావం చూపలేదు కాబట్టి వైరస్ బలహీన పడిందని తగ్గిందని కొందరు శాస్ర్తజ్ఞులు అంటున్నారు. కాబట్టి ముందు ముందు వచ్చే వేరియేంట్లు అంతగా ప్రభావం చూపకపోవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే..వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గిపోలేదని..జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ముందు ముందునా ఉందని అధ్యక్ష..కార్యదర్శి చెబుతున్నారు. మరి ఇలాంటి డైలమా? నడుమ రణబీర్ అనుకున్నట్లు పెళ్లి ఎప్పుడు జరుగుతుంది. బహుశా అలా జరగదనే అలియాభట్ ముందుగానే పెళ్లై అపోయిందని ఫిక్స్ అయిందా? ఏంటి!