ద్రౌపది పాత్రలో కనిపించనున్న రియా?

తెలుగులో తూనీగ తూనీగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రియా చక్రవర్తి, ఆ తర్వాత హిందీలో అడపాదడపా సినిమాలు చేసింది. ఈ భామ గతేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. డ్రగ్స్ కోణంలో విచారణ ఎదుర్కొని అరెస్టైన విషయం తెల్సిందే.

ఇప్పుడిప్పుడే ఈ కేసుల నుండి బయటపడి మళ్ళీ సినిమాల్లో నటిస్తోన్న రియాకు అద్భుతమైన ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మహాభారతం ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందించనున్నారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించడానికి రియాను అప్రోచ్ అయ్యారు నిర్మాతలు.

అయితే రియా ఇంకా ఈ ప్రాజెక్టును సైన్ చేయలేదు. ఈ చిత్రం చర్చల దశలో మాత్రమే ఉంది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీలతో ఆమె చేసిన చేహరే సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే.