జోర్సె జోర్సె.. డ్యాన్సుల్లో సాయి తేజ్ మ్యాజిక్కే వేరులే!

టాలీవుడ్ లో ఉన్న రేర్ డ్యాన్సింగ్ స్టార్ గా సాయి తేజ్ కి ఉన్న ఐడెంటిటీని గుర్తు చేయాల్సిన పని లేదు. ఎన్టీఆర్ .. బన్ని.. చరణ్ లతో పాటు రేసులో ఉన్న డ్యాన్సింగ్ స్టార్ అతడే. ఇప్పుడు అతడి డ్యాన్సుల్లో మ్యాజిక్ ని ఆవిష్కరిస్తూ రిపబ్లిక్ నుంచి ఒక పాట రిలీజైంది. సాయితేజ్ ఈ పాటలో సింపుల్ స్టెప్పులతోనే మ్యాజికల్ అనిపించాడు. రిపబ్లిక్ లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్ గా సాయి తేజ్ నటిస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. సాంగ్ లో ఐశ్వర్య ను ఆవిష్కరించారు. వీడియో సాంగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నపద ట్యూన్.. మన సాంప్రదాయ జీవనశైలిపై వెలుగు రేఖలు పరుస్తున్న సాహిత్యంతో ఆకట్టుకుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి.

ప్రస్థానం తర్వాత తిరిగి మరో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ తో దేవాకట్టా కంబ్యాక్ అవుతారనే అభిమానులు భావిస్తున్నారు. టీజర్ .. ట్రైలర్ తో ఆ నమ్మకం పెరిగింది. రిపబ్లిక్ అక్టోబర్ 1 న గాంధీ జయంతి సందర్భంగా విడుదలవుతోంది. జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె భగవాన్ – జె పుల్లారావు నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రిపబ్లిక్ లో జగపతి బాబు -రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

రిలీజ్ ముందు డైలమాలు!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం కుదుటపడుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాయితేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రాన్ని రిలీజ్ చేయడం బాగోదని నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ అలాంటి సన్నివేశం లేకుండా విడుదలకు సిద్ధం చేయడం చర్చకు వచ్చింది. అక్టోబర్ 1న రిలీజవుతోంది. జీటీవీ సంస్థ సినిమా హక్కులన్ని చేజిక్కించుకుంది. మార్కెట్ సహా అన్ని రకాల రైట్స్ అదే సంస్థకు నిర్మాతలు కట్టబెట్టారు. కాబట్టి రిలీజ్ విషయంలో వెనుకడుగు వేయకుండా చెప్పిన సమయానికి విడుదల చేస్తున్నారు. సెకెండ్ వేవ్ దాదాపు అదుపులోకి వచ్చిన నేపథ్యం..థర్డ్ వేవ్ ఇంకా ప్రారంభం కాకపోవడం వంటి సన్నివేశాల కారణంగా అగ్ర హీరోలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నారు. వాళ్లొచ్చిస్తే మీడియం హీరోలకు చోటు దొరకదు. ఆ కారణంగానూ `రిపబ్లిక్` ముందస్తు రిలీజ్ కు వస్తోంది. నాగచైతన్య లవ్ స్టోరి బిగ్ హిట్ కొట్టడంతో ఇప్పుడు రిపబ్లిక్ కి అది పాజిటివ్ గా మారనుందని అంచనా.